Peach Cobbler: ఈ పీచు పండు తినడం వల్ల 100 రోగాలకు చెక్ ?
Peach Cobbler: పీచ్ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది తెలుపు, పసుపు రంగులో ఉంటుంది. ఈ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. పీచ్ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దానివల్ల బరువు సులభంగా తగ్గుతారు. డైట్ లో ఈ ఫ్రూట్ ను చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Health Benefits With Peach Cobbler
ఇది అధికంగా పోషకాలతో నిండిన ఫ్రూట్. ఫైబర్ అధికంగా ఉంటుంది. పేగు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును తప్పకుండా తినాలి. వర్కౌట్ చేసిన తర్వాత స్నాక్స్ రూపంలో కూడా ఈ పండును తినవచ్చు. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
ఇది జీర్ణ ప్రక్రియ సక్రమంగా సాగేలా పనిచేస్తుంది. పీచ్ పండులో విటమిన్ ఏతో పాటు బీటా కెరోటిన్ కూడా అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కంటి సమస్యలను తొలగిస్తుంది. పీచ్ పండులో ఫైబర్ అధికంగా ఉంటుందని అమెరికన్ వైద్యులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియ సులభంగా సాగుతుంది.