Banana: కొంతమందికి భోజనం చేసిన అనంతరం ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చాలామంది అరటిపండు తినడానికి ఇష్టపడతారు. అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కానీ అరటి పండును మధ్యాహ్నం సమయంలో మాత్రమే తినాలి. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు, నష్టాలు వాటిల్లుతాయని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. రాత్రిపూట అరటిపండు తిన్నట్లయితే జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. Banana
Health Issues With Banana at night Times
ఒకవేళ జలుబు లేదా దగ్గు సమస్యలు ఉన్నవారు అయితే కొన్ని రోజులు అరటిపండును తినకపోవడమే మంచిది. రాత్రి సమయంలో శరీరంలో మెటబాలిజం స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అరటిపండు తినడం వల్ల విపరీతంగా బరువు పెరగడంతో పాటు ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి. అరటిపండు మధ్యాహ్న సమయంలో లేదా ఉదయం ఎప్పుడు తిన్న ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ రాత్రి సమయంలో తింటే మాత్రం సమస్యలు తలెత్తుతాయి. Banana
Also Read: Ms Dhoni: RCBపై కోపంతో..టీవీ పగలగొట్టిన ధోనీ ?
అరటిపండు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల రాత్రిపూట తినకపోవడమే మంచిది. అరటి పండులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అరటిపండు తిన్నట్లయితే నిద్రలేమి సమస్యలు వాటిల్లుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందువలన రాత్రిపూట అరటిపండుకు దూరంగా ఉండాలి. షుగర్ పేషెంట్లు అరటి పండ్లను తినకపోవడం చాలా మంచిది. ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల షుగర్ పెరిగే సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. చిన్నపిల్లలకు రాత్రి సమయంలో అరటిపండు తినిపించకూడదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Banana