Mohan Babu: రజినీకాంత్ తో కాళ్లు మొక్కించుకున్న మోహన్ బాబు.?
Mohan Babu: ఏంటి మోహన్ బాబు కాళ్లు రజినీకాంత్ పట్టుకోవడమా..సినిమా షూటింగ్లో భాగంగా అలా జరిగిందా.. లేక నిజంగానే మోహన్ బాబు కాళ్లు రజినీకాంత్ పట్టుకున్నారా అంటే అది సినిమా షూటింగ్ కోసం కాదు. నిజంగానే రజినీకాంత్ మోహన్ బాబు కాళ్లు పట్టుకున్నారు. మరి వయసులో మోహన్ బాబు కంటే రజినీకాంత్ పెద్ద..ముఖ్యంగా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అలాంటిది రజినీకాంత్ మోహన్ బాబు కాళ్లు పట్టుకోవడం ఏంటి అని చాలామందిలో ఒక ఆశ్చర్యమైతే ఉంటుంది.మరి ఇంతకీ రజినీకాంత్ మోహన్ బాబు కాళ్లు ఎందుకు మొక్కారో ఇప్పుడు చూద్దాం..

Rajinikanth Mohan Babu intersting news
మోహన్ బాబు హీరోగా చేసిన పెదరాయుడు మూవీలో మోహన్ బాబు తండ్రి పాత్రలో రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో వీరి కాంబినేషన్ ఎంత బాగుందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మోహన్ బాబు సినీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అయితే ఈ సినిమా తమిళ రీమేక్ మూవీ. ఈ సినిమా చేయాలని రజినీకాంత్ స్వయంగా మోహన్ బాబుకు చెప్పారట. దాంతో రిమేక్ రైట్స్ ని మోహన్ బాబు కొనుగోలు చేసి తెలుగులో బి.గోపాల్ తో డైరెక్షన్ లో దీన్ని చేద్దామనుకున్నారు. (Mohan Babu)
Also Read: Prabhas: ప్రభాస్ తో 75 సార్లు సినిమా తీసే ఛాన్స్ మిస్ అయిన డైరెక్టర్.?
కానీ తమిళ్ రీమేక్ సినిమా అని బి.గోపాల్ రిజెక్ట్ చేసారట. ఆ తర్వాత ఈ సినిమాకి రవి రాజా పినిశెట్టిని డైరెక్టర్ గా తీసుకొని సినిమా షూటింగ్ మొదలెట్టారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ మోహన్ బాబు సినిమాని తెరకెక్కించారు.కానీ చివరికి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అప్పటివరకు ఘరానా మొగుడు సినిమాకి 10 కోట్ల కలెక్షన్ తో హైయ్యెస్ట్ ప్లేస్ లో ఉండేది. కానీ పెదరాయుడు సినిమా 12 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి ఘరానా మొగుడు సినిమాని బీట్ చేసింది.

అయితే ఈ సినిమా విడుదలయ్యాక తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నేను ఇంత పెద్ద హీరోని అనే ఈగో ఎక్కడా కూడా ప్రదర్శించకుండా మోహన్ బాబు కాళ్లు పట్టుకున్నారట. అయితే ఫ్లాపుల్లో ఉన్న మోహన్ బాబు కి ఒక మంచి కథని సజెస్ట్ చేసిన రజినీకాంత్ అలా మోహన్ బాబు కాళ్లు ఎందుకు పట్టుకున్నారో ఇప్పటికీ అర్థం కాదు.ఇక ఈ సినిమా గురించి మరొక విశేషం ఏంటంటే..ఈ సినిమాలో నటించిన రజినీకాంత్ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఫ్రెండ్ కోసం ఫ్రీగా చేశారట.(Mohan Babu)Mohan Babu