IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… ఆ ప్లేయర్ అవుట్ ?


IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం అంతా సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి ఐపీఎల్ సీజన్ రంగం సిద్ధమవుతోంది. దీనికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురయింది. ఈ ఆర్సిబి స్టార్ ఐపిఎల్ 2025లో పాల్గొంటాడా లేదా అనే దానిపై ఓ ప్రశ్న తలెత్తింది. మెగా వేలంలో దాదాపు రూ. 2.30 కోట్లు ఖర్చు చేసి ఆర్సిబి ఈ ఆటగాడిని తన జట్టులోకి చేర్చుకుంది.

Pretty sure Jacob Bethell is ruled out of Champions Trophy IPL 2025

కానీ ipl 2025లో అతను లేకపోవడం వల్ల జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో తొలి మ్యాచ్ 21న జరగనుండగా మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. జట్టులోని స్టార్ ఆటగాడు గాయం కారణంగా ఐపీఎల్ 2025లో ఆడకపోవచ్చు. ఫిబ్రవరి 6న భారత్-ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. దీనిలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

2-0తో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఇంగ్లీష్ జట్టు యువ ఆటగాడు జాకబ్ బెతెల్ గాయపడ్డాడు. ఆ కారణంగా అతను గత రెండు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. రెండవ మ్యాచ్ కు ముందు అతనికి తొడ కండరాల నొప్పి వచ్చింది. కెప్టెన్ జోస్ బట్లర్ తన పునరాగమనం గురించి ఒక అప్డేట్ వెల్లడించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి బెతెల్ దూరంగా ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. ఈ భారీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న అనంతరం అతను ఈ సీజన్ లో కూడా ఆర్సిబికి అందుబాటులో ఉండకపోవచ్చు అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *