Fake Accounts Issue: బుల్లి రాజు ఫేక్ అకౌంట్స్ వివాదం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు!!


Child Artist Revanth Fake Accounts Issue

Fake Accounts Issue: విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా సంక్రాంతి పండుగకు గిఫ్ట్‌లా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనతో పాటు, ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Child Artist Revanth Fake Accounts Issue

ఈ సినిమాలో చిన్నారి నటుడు రేవంత్ భీమాల (Child Artist Revanth Bheemaala) “బుల్లిరాజు” పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, సహజమైన నటన ద్వారా బుల్లిరాజు పాత్రకు ప్రాణం పోశాడు. సినిమాలో బుల్లిరాజు కనిపించి ప్రతిసారి ప్రేక్షకులు నవ్వులతో థియేటర్‌ను హోరెత్తించారు. ఆయన సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి.

అయితే, రేవంత్ భీమాల పేరుతో ఫేక్ అకౌంట్స్ (Fake Accounts Issue) క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని అతని తండ్రి భి. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు రేవంత్ పేరును వాడుకుని పోలిటికల్, ప్రమోషనల్ పోస్టులు పెడుతున్నారని, ఇది ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలవరపెడుతోందని తెలిపారు.

“మా అబ్బాయి పేరుతో తప్పు ప్రచారం (False Promotions) జరుగుతోంది. అతనికి అధికారికంగా Instagram లో మాత్రమే అకౌంట్ ఉంది. Facebook, YouTube, X, Insta (Facebook, YouTube, X, Instagram) లో ఇతర అకౌంట్స్ లేవు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని రేవంత్ తండ్రి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *