Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కెరీర్ కష్టాలు.. హిట్ సినిమా కోసం ఎదురుచూపు!!

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజల్, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేకపోవడంతో ఆమె అభిమానులు కూడా నిరాశకు గురవుతున్నారు.
Kajal Aggarwal Career Struggles
గత మూడేళ్లుగా కాజల్ కెరీర్ ఒడిదుడుకుల్లో సాగుతోంది. ‘ఆచార్య’ సినిమాతో ఆమెకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రను తొలగించడం కాజల్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఘోస్ట్’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనా, చివరి నిమిషంలో ఆమెను తప్పించారు. ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించినా, ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
‘ఇండియన్ 2’ సినిమాతోనైనా తన దశ మారుతుందని కాజల్ ఆశించింది. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దర్శకుడు శంకర్ ఆమె పాత్రను ‘ఇండియన్ 3’కి మార్చేశారు. అయితే ‘ఇండియన్ 2’ ఫలితాన్ని బట్టి ‘ఇండియన్ 3’ ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం కాజల్ ‘కన్నప్ప’ సినిమాలో పార్వతి పాత్రలో నటిస్తున్నారు. ఒకప్పటి టాప్ హీరోయిన్‌కు మళ్లీ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోనైనా కాజల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతుందా లేదా చూడాలి.
https://twitter.com/pakkafilmy007/status/1600352362639822848