IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం డిసెంబర్ లేదా నవంబర్ చివర్లో మెగా వేలం జరగనుంది.ఈ మెగా వేలం సందర్భంగా… ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ ప్రకటించేసింది బీసీసీఐ పాలకమండలి. ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో జట్టు ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకోవచ్చు. ఇందులో ఆర్పిఎం రూల్ కూడా తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఐపీఎల్ జట్లకు చాలావరకు మేలు జరగనుంది. IPL 2025

Three unsold captains in IPL 2025 auction

అయితే మెగా వేలం త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో… జాతీయ జట్లకు కెప్టెన్సీ వహించిన ముగ్గురు ప్లేయర్లను… ఈసారి కూడా ఐపిఎల్ లో ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ వరుసలో మొదటగా న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సౌతి ఉన్నారు. ఈయన న్యూజిలాండ్ కెప్టెన్ గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ… గత ఐపిఎల్ లో ఎవరు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు కొనే పరిస్థితి లేదని చెబుతున్నాయి నివేదికలు. IPL 2025

Also Read: Hyderabad: హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. అందరూ వినియోగించుకోవాలని!!

బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్లా హుస్సేన్ షాంటో…పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయనను కూడా ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ t20 కెప్టెన్ గా ఉన్నా కూడా హుస్సేన్ వేలంలోకి వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. వచ్చినా కూడా ఆయన పరువు పోవడం గ్యారంటీ అంటున్నారు. అటు శ్రీలంక కెప్టెన్ చరిత్ ఆశలంక పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఆయనను కూడా ఈసారి వేలంలో కొనుగోలు చేసే అవకాశాలే లేవట. అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ పనికిరాని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయట. IPL 2025