Sobhita:శోభితకు బదులు చైతూ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే బాగుండు.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.?
Sobhita: అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఇప్పటికి నిలదొక్కుకోలేకపోతున్నారు.. ఇక అఖిల్ అయితే ఏ సినిమా తీసిన పూర్తిగా ఫ్లాపే అవుతుంది.. ఓ మోస్తారుగా నాగచైతన్య పడుతూ లేస్తూ వస్తున్నారు.. ఇదే తరుణంలో నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ వచ్చిన విషయం అందరికీ తెలుసు.. శ్రీకాకుళం మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి ఈ చిత్రానికి, కాస్త లవ్ స్టోరీ ని యాడ్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు చందు మొండేటి.

It would be better if Chaitu marries that heroine instead of Sobhita fans new demand
ఈ సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అలా అన్ని హంగులు కలగలుపుకొని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజే అద్భుతమైన టాక్ తో దూసుకెళ్లింది.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోందని చెప్పవచ్చు.. నాగచైతన్య కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో అక్కినేని అభిమానులతో పాటు ఫ్యామిలీ మొత్తం చాలా ఆనందంగా ఉన్నారు.. అయితే ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల విషయంలో దూసుకుపోతోంది త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరబోతుందని చిత్ర యూనిట్ వారు భావిస్తున్నారు.. (Sobhita )
Also Read: Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కెరీర్ కష్టాలు.. హిట్ సినిమా కోసం ఎదురుచూపు!!
అలాంటి ఈ చిత్రం హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్.. ఈ ప్రోగ్రాంకి నాగార్జున హాజరై పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇదే తరుణంలో సక్సెస్ మీట్ కు వచ్చి చాలా రోజులవుతుందని చాలా ఆనందపడ్డారు.. ఇదంతా శోభిత మా ఇంట్లో అడుగు పెట్టడం వల్లే జరిగిందని చెప్పకనే చెప్పారు..కట్ చేస్తే సినిమా చూసి బయటకు వచ్చి మీడియా సమావేశంలో ఒక అభిమాని మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు..

ఇందులో నాగచైతన్య సాయిపల్లవి మధ్య సాగే లవ్ సీన్స్ చూస్తే రియల్ గానే జరిగినట్టు అనిపించిందని అన్నారు.. ప్రతి ఒక్క లవర్స్ ఈ సినిమా చుడడానికి ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా నాగచైతన్య సాయిపల్లవి మధ్య కాంబినేషన్ బాగా సెట్ అయిందని, అసలు నాగచైతన్య శోభిత దూళిపాళను కాకుండా సాయిపల్లవిని పెళ్లి చేసుకుంటే మరింత బాగుండేదని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది నెటిజన్స్ లాస్ట్ పాయింట్ బాగా చెప్పారు బ్రో నిజంగానే సాయిపల్లవిని నాగచైతన్య చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆయన అన్న మాటలకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Sobhita )