Akkineni Akhil: వెరైటీ పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని అఖిల్.. హీరో అయి ఉండి అలాంటి పనా.?
Akkineni Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ఒక ముఖ్య పిల్లర్ అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు.. ఆయన ఇండస్ట్రీలో ఎదగడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేసినా గొప్ప మహనీయుడు.. అలాంటి ఏఎన్నార్ నట వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఈయన కూడా తండ్రిలాగే చాలా పేరు తెచ్చుకున్నారు.. నాగార్జున నట వారసులుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు నాగచైతన్య, అఖిల్..

Akkineni Akhil who is going to marry variety
ఇందులో నాగచైతన్య స్టార్డం పొందినా కానీ అఖిల్ మాత్రం ఇంకా సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.. అలాంటి ఈ తరుణంలో అఖిల్ వెరైటీ పెళ్లి చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ మధ్యకాలంలోనే ఆయన జైనబ్ రావడ్జీతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫోటోలు కూడా బయటపెట్టారు.. అయితే మార్చి 24న వీరి పెళ్లి కూడా జరగబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. (Akkineni Akhil)
Also Read: Sobhita:శోభితకు బదులు చైతూ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే బాగుండు.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.?
అయితే చాలామంది అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తారని అనుకుంటున్నారు..కానీ అఖిల్ మాత్రం తన పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోబోతున్నారట.. ఈ పెళ్లి వారి ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైనటువంటి అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ జైనబ్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని ఒక్కటి కాబోతున్నారట.. ఇక దుబాయ్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి దగ్గరి కుటుంబీకులు కొంతమంది సినీ స్టార్స్,రాజకీయ నాయకులని ఆ పార్టీకి పిలువనున్నారట.. (Akkineni Akhil)

ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అక్కినేని అఖిల్ చాలా గ్రేట్..అంత పెద్ద పొజిషన్ లో ఉన్న సింపుల్ గా పెళ్లి చేసుకుంటాననడం ఆయన క్యారెక్టర్ కు నిదర్శనం అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.. సినిమా కెరియర్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా భారీ హిట్ సాధించలేదు.(Akkineni Akhil)