Jp Duminy: దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని సబ్సిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆటగాళ్లతో పోటీ పోటీగా ఆడుతూ పరుగులను అడ్డుకున్నాడు. అబుదాబి వేదికగా సోమవారం ఐర్లాండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో డుమిని ఫీల్డర్ గా తన అవతారాన్ని చూపించాడు. వేడి తీవ్రతను తట్టుకోలేక ఆటగాళ్లందరూ అలసటకు గురయ్యారు. దీంతో అతనే మైదానంలోకి అడుగుపెట్టారు. 2019 జులైలోనే జెపి డుమిని అన్ని ఫార్మట్లకు రిటర్మెంట్ తీసుకున్నాడు. Jp Duminy

South Africas batting coach JP Duminy fields in ODI against Ireland

అయితే 40 ఏళ్ల డుమిని గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ గా బాధ్యతలను తీసుకున్నారు. 2004 నుంచి 2019 వరకు సౌత్ ఆఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. దీంతో డుమిని ఆల్ రౌండర్ గానే కాకుండా బెస్ట్ ఫీల్డర్ గా జట్టు విజయాల్లో కీలకమైన పాత్రను పోషించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా నామమాత్రపు మూడో వన్డేలో ఐర్లాండ్ చేతిలో 69 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. Jp Duminy

Also Read: Rinku Singh: రింకూ సింగ్ చేతిపై కొత్త‌ టాటూ..సీక్రెట్ ఇదే ?

వన్డే ఫార్మాట్ లో ఐర్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓటమి ఎదుర్కోవడం ఓవరాల్ గా ఇది రెండోసారి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్నీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 284 పరుగులు చేసింది అనంతరం చేదనలో సౌత్ ఆఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో సౌతాఫ్రికాపై ఐర్లాండ్‌ జట్టు గెలవడం జరిగింది. Jp Duminy