Pushpa-2: పుష్ప-2 క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్.. తెలియాలంటే ఇది చూడాల్సిందే.?
Pushpa-2: పుష్ప-2..ఈ సినిమా గురించి ప్రస్తుతం అందరి నోళ్లలో నుండి ఒకటే మాట వినిపిస్తోంది. అదేంటంటే పుష్పటుకి సీక్వెల్ గా పుష్ప-3 కూడా ఉండబోతుందని. అయితే గతంలోనే విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని చెప్పారని అప్పటి ట్వీట్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.అంతేకాదు విజయ్ దేవరకొండనే పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా చేస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
A huge twist in the climax of Pushpa-2
ఇదంతా పక్కన పెడితే పుష్ప-2 సినిమా ఎండింగ్ చాలా డిఫరెంట్గా ఉండాలని వేరే లెవల్లో డైరెక్షన్ చేశారట డైరెక్టర్ సుకుమార్.అయితే గతంలో ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప టు క్లైమాక్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా లేని విధంగా తెరకెక్కిస్తున్నాం.ఈ సినిమా క్లైమాక్స్ కోసమే చాలా రోజుల టైం పడుతుంది అంటూ చెప్పారు. (Pushpa-2)
దీంతో పుష్ప-2 సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే పుష్ప-2 సినిమాలోని క్లైమాక్స్ బాహుబలి పార్ట్ వన్ ని మించి ఉంటుందని బాహుబలి 2 కోసం ఎలా అయితే ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురు చూసారో పుష్ప టు క్లైమాక్స్ కూడా అలాగే ఉండి పుష్ప -3 కోసం సస్పెన్స్ పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి పుష్ప టు క్లైమాక్స్ లో ఉండే ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే కచ్చితంగా సినిమా మొత్తం చూడాల్సిందే అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపిన పుష్ప-2 సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.(Pushpa-2)