Andhra Pradesh Secretariat: పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో మంటలు…?
Andhra Pradesh Secretariat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఒక్కసారిగా ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సచివాలయంలోని రెండవ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది… మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సచివాలయం రెండో బ్లాక్ లోనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ఉంటుందని చెబుతున్నారు.

A serious accident occurred at the Andhra Pradesh State Secretariat
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం తో పాటు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ కార్యాలయాలు కూడా ఉంటాయని సమాచారం అందుతుంది. అయితే వీళ్ళందరి కార్యాలయాలకు మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. అయితే మంటలు ఎగ్జిబిడ్డ నేపథ్యంలో వెంటనే ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
Mad 2: మ్యాడ్ స్క్వేర్ “లడ్డుగాడి” కి విజయ్ దేవరకొండ కి మధ్య ఉన్న రిలేషన్.. అంత దగ్గరా.?
ప్రమాద సంఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కావాలని ఎవరైనా చేశారా? దీని వెనుక కుట్ర కోణం ఉందా? సాధారణంగా జరిగిందా అనే వివరాలను పరిశీలిస్తున్నారు అధికారులు.
Chiranjeevi: అప్పటి హాట్ బ్యూటీ తో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్న చిరంజీవి.. కానీ.?