Game Changer: కోలీవుడ్ లో గేమ్ ఛేంజర్ కి షాక్ ఇండియన్ -3.. రిలీజ్ అడ్డుకుంటాం అంటూ.?
Game Changer: తమిళ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ కి షాక్ తగలబోతుందా.. ఇండియన్ 3 వల్ల గేమ్ చేంజర్ చిక్కుల్లో పడిందా..ఇంతకీ తమిళ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గత ఏడాది కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీ విడుదలై అట్టర్ ప్లాఫ్ అయింది.ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో ఈ ఏడాది జనవరి 10న గేమ్ ఛేంజర్ విడుదల కాబోతుంది.
A shock to the Game Changer in Kollywood
అయితే ఈ సినిమా విడుదలకు ముందు తమిళనాడులో గేమ్ ఛేంజర్ కి పెద్ద షాక్ తగిలినట్టు అయింది.గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లో విడుదలవుతుంది. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తమిళంలో రిలీజ్ చేయవద్దు అని లైకా ప్రొడక్షన్ వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని కలిసి గేమ్ ఛేంజర్ కి,శంకర్ కి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే గేమ్ చేంజర్ సినిమా కంటే ముందే ఇండియన్ -3 పూర్తి చేస్తామని బాధ్యతలు తీసుకున్నారట శంకర్.(Game Changer)
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. టార్చర్, బోరింగ్..?
అయితే ఇండియన్ త్రీ మూవీ ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయింది. కొంచెం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది..దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండా గేమ్ చేంజర్ సినిమాని రిలీజ్ చేసేది లేదు అంటూ లైకా ప్రొడక్షన్ వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని కలిసినట్టు తెలుస్తోంది. ఇక ఈ రచ్చ కారణంగానే తమిళనాడులో గేమ్ ఛేంజర్ మూవీ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అవ్వలేదని తెలుస్తోంది.మరి గేమ్ ఛేంజర్ మూవీ తమిళనాడులో లేటుగా విడుదలవుతుందా..
లేక లైకా ప్రొడక్షన్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి సినిమాని రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి అంతగా దిగులు పడాల్సిన అవసరం లేదని, ఇప్పటికే సినిమాకి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని, త్వరలోనే బుకింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయని,ఈ మూవీ కోలీవుడ్ లో దాదాపు 400 థియేటర్లలో విడుదలవుతుందని, బయ్యర్లతో ఒప్పందాలు కూడా కుదిరాయని,శంకర్ క్రేజ్ కారణంగా తమిళనాడులో ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవుతుందని తమిళనాడు క్రిటిక్స్ అంటున్నారు.(Game Changer)