Krishnam Raju: ఒక్క సిగరెట్ ప్యాకెట్ కృష్ణంరాజును జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టిందా.?
Krishnam Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు శాసించిన వ్యక్తులలో సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు మొదటి స్థానంలో ఉండేవారు. ఇండస్ట్రీలో వీరు ఎదగడమే కాకుండా తెలుగు ఇండస్ట్రిని ఎదిగేలా కూడా చేశారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈయన రాజుల ఫ్యామిలీలో పుట్టినా కానీ సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈయన మొదటిసారిగా 1966లో చిలకా గోరింక అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
A single packet of cigarettes dealt an irreparable blow to Krishnam Raju life
మొదటి చిత్రంతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈ సినిమా కంటే ముందే హీరోగా పరిచయం అయ్యే వారట. కానీ ఆయన చేసిన ఒక చిన్న తప్పే ఆయనను ఆ సినిమా నుంచి రిజెక్ట్ చేసింది. మరి ఆ తప్పేంటి వివరాలు ఏంటో చూద్దాం.. అప్పట్లో దిగ్గజ డైరెక్టర్ గా పేరుపొందిన మధుసూదన్ రావు హీరో ఎన్టీఆర్ తో ‘వీరాభిమాని’ చిత్రాన్ని చేశారు.. ఇందులో కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ను తీసుకోగా, మరో కీలక పాత్ర అభిమన్యుకు కొత్త వ్యక్తి కావాలని అనుకున్నారట.. దీనికోసం ఆడిషన్స్ నిర్వహించారట. (Krishnam Raju)
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి అలాంటి వ్యాధి.. అందర్నీ అవమానిస్తూ.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు.?
ఈ ఆడిషన్స్ కు కృష్ణంరాజును రావాలని చెప్పారట.. దీంతో కృష్ణంరాజు మధుసూదన్ రావు ఆఫీసుకు ఉదయాన్నే వెళ్లి కూర్చున్నాడు.. అప్పటికి ఆయన ఆఫీసుకు రాలేదు.. అక్కడే కాసేపు కూర్చొని తన జేబులో నుంచి 555 అనే సిగరెట్ ప్యాకెట్లు తీసి ఒక సిగరెట్ కాల్చి అదే టేబుల్ పై ఆ ప్యాకెట్ ను ఉంచారట.. అలా ఒక సిగరెట్ కాల్చి కాసేపు బయటకు వెళ్లొద్దామని వెళ్లారట. అంతలోనే మధుసూదన్ రావు ఆఫీసుకు వచ్చి కూర్చున్నారు.. కాసేపటికి కృష్ణంరాజును లోపలికి రమ్మని ఆఫీస్ బాయ్ ద్వారా కబురు పంపారట. వెంటనే రూమ్ లోకి వెళ్ళగానే, రాజును ఈ సిగరెట్ ప్యాకెట్ నీదేనా అని అడిగారట మధుసూదన్ రావు..
వెంటనే నాదే సార్ అని చెప్పడంతో ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడట దర్శకుడు.. అంతసేపు వెయిట్ చేస్తే ఏం మాట్లాడకుండా వెళ్లిపొమ్మంటారేంటి సార్ అని అడగడంతో, నాకు సిగరెట్ తాగే వాళ్ళు అంటే పరమ చిరాకు, నా సినిమా కోసం నీ హ్యాబిట్ ను పాడు చేసుకోవద్దు..నీ ఇష్టాన్ని కాదనే శక్తి నాకు లేదు.. ఈ ఆఫర్ నీకు ఇవ్వలేనని ఖరాకండిగా చెప్పారట. ఈ విధంగా మొదటి సినిమా అవకాశాన్ని మిస్ చేసుకున్న కృష్ణంరాజు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చిలక గోరింకా అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.(Krishnam Raju)