Director: పెళ్లికి తాళిబొట్టు కొనలేని దీన స్థితిలో స్టార్ డైరెక్టర్.?
Director: ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, డైరెక్టర్లు ఇతర నటినటులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి స్థాయికి వెళ్లారు.. టాలెంట్ ఉండాలే కానీ ఎక్కడికి వెళ్ళినా రాణించగలమని నిరూపించారు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి ఈ వ్యక్తి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి తిరిగి చివరికి స్టార్ దర్శకుడిగా మారారు..

A star Director in a poor state of not being able to buy a thali
చివరికి తాను పెళ్లి చేసుకునే సమయంలో తాళిబొట్టు కొనడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే తన స్నేహితులైనటువంటి నటులు సహకారం అందిస్తే పెళ్లి చేసుకున్నారట.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే పూరి జగన్నాథ్.. తన సినిమాలతో మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, అల్లు అర్జున్, వంటి హీరోలకు మంచి కెరియర్ ను అందించిన డైరెక్టర్. అలాంటి ఈయన తన కెరియర్ స్టార్టింగ్ లో లావణ్యతో లవ్ లో ఉన్నారట.. (Director)
Also Read: Heroine: భర్త తమ్ముడితో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్..?
అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో లావణ్య పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టిందట. దీంతో పూరి జగన్నాథ్ ఏమీ చేయలేక ఆమెను గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామని ప్రిపేర్ అయ్యారట. ఆ సమయంలో తన చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో, యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు, నటి హేమ కొత్త బట్టలు కొనిచ్చిందట. కొంతమంది పూలదండలు ఇతర కూల్ డ్రింక్స్ ఆయనకు సహకారం అందించారట.

అలా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్ద స్టార్ డైరెక్టర్ అయ్యారు పూరి జగన్నాథ్. ఇప్పటికి ఆయన ఏదైనా ఇంటర్వ్యూలో ప్రోగ్రామ్స్ లో మాట్లాడిన యాంకర్ ఝాన్సీ, నటి హేమాను గుర్తు చేసుకుంటూ ఉంటారు.. అలా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి బాగా సంపాదించిన పూరి జగన్నాథ్ కొంతమంది స్నేహితులను నమ్మి మోసపోయి డబ్బంతా పోగొట్టుకున్నారు.. వారు డబ్బు లాక్కున్నారు కానీ టాలెంట్ ను ఎవరు లాక్కోలేరు కాబట్టి మళ్లీ సినిమాల ద్వారా పూరి జగన్నాథ్ ఎదుగుతున్నారని చెప్పవచ్చు..(Director)