Aamani: భర్తతో విడాకులు.. ఆమని సూసైడ్.. ఏం జరిగిందంటే.?

Aamani: సీనియర్ నటి ఆమని తమిళ ప్రొడ్యూసర్ అయినటువంటి ఖాజా మొహీయుద్దీన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమని నటించడం సినిమాకి నిర్మాతగా ఖాజా మొహియుద్దిన్ చేశారు. అలా ఆ సినిమాను నిర్మించే సమయంలోనే ఆమనికి ఖాజా మొహియుద్దిన్ కి మధ్య ప్రేమ చిగురించింది. అలా వీరిద్దరూ చాలా రోజులు డేటింగ్ చేసి చివరికి పెళ్లి చేసుకున్నారు.
Aamani committed sucide what happened
ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమనికి తన భర్త తో సంసార జీవితం కొద్దిరోజులు బాగానే గడిచినప్పటికీ ఆ తర్వాత అనుకోని మనస్పర్ధలు ఇద్దరి మధ్య ఏర్పడడంతో చివరికి విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో భర్తతో కలిసి ఉన్న సమయంలో ఆమని సూసైడ్ చేసుకుందని దానికి కారణం భర్తనేనని,భర్త చేసినా పని వల్లే ఆమని సూసైడ్ చేసుకుంది అంటూ రూమర్లు వినిపించాయి.(Aamani)
Also Read: Lavanya Tripathi: ఉగాది పండగ రోజు బయటపడ్డ లావణ్య త్రిపాఠి బేబీ బంప్..?
మరి నిజంగానే ఆమని సూసైడ్ చేసుకుందా అంటే అది కేవలం రూమర్ మాత్రమేనట.అయితే సూసైడ్ చేసుకుంది ఆమని కాదట.ఆమె భర్త ఖాజా మొహియుద్దిన్ అట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఆమని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నా భర్త సూసైడ్ చేసుకుంటే నేనే సూసైడ్ చేసుకున్నానని మీడియా వాళ్ళు తప్పుగా రాశారు.

అయితే మా ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయంలో నేను పక్కనే ఉండడంతో మీడియా వాళ్ళు నేనే సూసైడ్ చేసుకున్నానని దుష్ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. మా ఆయన ఓ సినిమాని నిర్మించిన సమయంలో ఆ సినిమాకి ఆశించినంత ఫలితం రాకపోవడంతో అప్పులపాలై చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.దాంతో సూసైడ్ చేసుకున్న ఆయన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడే ఉన్న నన్ను చూసి మీడియా వాళ్ళందరూ నేనే ఆత్మహత్య చేసుకున్నానని రాశారు.(Aamani)