Aamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్య,ఆమని, మీనా,రమ్యకృష్ణ,స్నేహ ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.కానీ అందరి హీరోయిన్లలో సౌందర్య,ఆమని మాత్రం చాలా క్లోజ్ గా ఉండేవారు.అంతే కాదు సౌందర్య చనిపోయిన సమయంలో ఆమని ఎంతగా బాధపడిందో ఇప్పటికీ ఆమె పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో బయటపడుతుంది. అంతేకాకుండా సౌందర్య తనకి మంచి స్నేహితురాలు.. కానీ ఆమె చనిపోవడం చాలా బాధాకరం.
Aamani: That woman ruined my marriage with Soundarya Anna
ఆ దేవుడు ఆమెను బతికించి నన్ను తీసుకుపోయినా బాగుండు అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో సౌందర్య మరణం గురించి మాట్లాడి ఎమోషనల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పట్లో ఆమని అన్ని కలిసొస్తే సౌందర్యకు వదినై సౌందర్య ఇంటికి కోడలుగా వెళ్లేదట. ఎలా అంటే సౌందర్య అన్నయ్య అమర్ ఇండస్ట్రీ వాళ్లకు తెలిసే ఉంటుంది. అప్పట్లో సౌందర్య కి సంబంధించిన అన్ని విషయాలు అమర్ దగ్గర ఉండి చూసుకునేవారు. (Aamani)
Also Read: Nagarjuna: నాగార్జునకు నిఖిత అనే కూతురు ఉందా.. బయటపడ్డ సంచలన నిజం.?
ఇక సౌందర్య ఆమని క్లోజ్ అవ్వడంతో ఓరోజు ఆమని సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్తే సౌందర్య వాళ్ళ తండ్రి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా మీ ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడుతుంది అని చెప్పారట. దానికి సౌందర్య ఆమని ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ బిక్క మొహాలు వేసుకున్నారట. ఎందుకంటే అమర్ కి అప్పటికే ఒక లవర్ ఉంది. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇద్దరు సతమతమయ్యారట.
ఇక సౌందర్య తండ్రి మరణించాక అమర్ తన లవర్ ని పెళ్లి చేసుకున్నాడు..అంటూ ఆమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలా ఒకవేళ అమర్ ఆ అమ్మాయిని ప్రేమించకపోయి ఉంటే ఆమని సౌందర్య అన్నయ్యని పెళ్లి చేసుకొని సౌందర్య కి వదిన అయ్యేది.కానీ అమర్ కి లవర్ ఉండడం వల్ల వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం బంధుత్వంగా మారలేకపోయింది.(Aamani)