Tandel Trailer: బాలీవుడ్ మెప్పు పొందుతున్న నాగ చైతన్య ‘తండేల్’ ట్రైలర్!!
Tandel Trailer: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న హై యాంటిసిపేటెడ్ మూవీ “తండేల్” విడుదలకు సిద్ధంగా ఉంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ముంబైలో ఈ చిత్ర హిందీ ట్రైలర్‌ను లాంచ్ చేసి, సినిమాపై విశేషంగా ప్రశంసలు కురిపించారు.
Aamir Khan Praises Tandel Trailer
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ, “అరవింద్ గారు నాకు సోదరుడిలాంటి వారు. తండేల్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలించే అంశాలు ఇందులో ఉన్నాయి” అని అన్నారు. అలాగే, “నాగ చైతన్య టాలెంటెడ్ యాక్టర్, సాయి పల్లవి కూడా అద్భుతమైన నటి. దర్శకుడు చందూ మూవీని అత్యంత హృద్యంగా తెరకెక్కించారు” అంటూ ప్రశంసలు గుప్పించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన “డింకాచిక డింకాచిక” సాంగ్ తనకు ఎంతో నచ్చిందని, డాన్స్ చేయించాలనే ఉత్సాహం తెచ్చిందని పేర్కొన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ, “తండేల్ కథ నాకు మొదటి నుండి చాలా ప్రత్యేకంగా అనిపించింది. అమీర్ ఖాన్ గారి లాంచ్ మా టీమ్‌కి గొప్ప సపోర్ట్. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే కథ” అని చెప్పారు. సాయి పల్లవి తన పాత్రను అద్భుతంగా పోషించిందని, దర్శకుడు చందూ ఈ కథను ఎంతో బలంగా తెరపై చూపించారని తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “తండేల్ నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. వైజాగ్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు పొరపాటున పాక్ సరిహద్దులు దాటి జైలుకు వెళ్లిన సంఘటన ఇది” అని వివరించారు. ఈ కథను తెరకెక్కించేందుకు చందూ ఎంతో కష్టపడ్డారని, నాగచైతన్య తన “కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్” ఇచ్చారని అన్నారు. ఫిబ్రవరి 7న “తండేల్” గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో, ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.