Ameer Khan: బెంగళూర్ మహిళతో అమీర్ ఖాన్ సీక్రెట్ ఎఫైర్.. త్వరలోనే 3 పెళ్లి..?
Aamir Khan: ఇండియన్ సినీ చరిత్రలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఎన్నో ఆల్ ఇండియా చిత్రాలు వచ్చి హీరోలంతా దేశమంతా పరిచయమవుతున్నారు కానీ, ఆల్ ఇండియా అనే పదం రాకముందే బాలీవుడ్ హీరోలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం సినిమాల గురించే కాకుండా, డిఫరెంట్ కల్చర్ కూడా ఉంటుంది. పెళ్లి, పిల్లలు, విడాకులనే విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకుంటారు.
Aamir Khan secret affair with Bangalore Lady
ఇండియాలో అయినా విదేశీయుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు.. అలా బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, గుర్తింపు పొందారు అమీర్ ఖాన్.. అయితే ఈయన 59 ఏళ్ల వయసులో ఒక బెంగళూరు యువతితో ప్రేమలో పడ్డారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. అమీర్ ఖాన్ ఎప్పుడైనా సరే తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు.. తాజాగా ఆయన తారే “జమీన్ పార్ సితారే జమీన్ పార్” ని విడుదల చేస్తున్నారు. ( Aamir Khan)
Also Read: Prabhas Surprises Immanvi: హీరోయిన్ కు ప్రభాస్ స్పెషల్ ఫుడ్.. సర్ప్రైజ్ అయిన ఇమాన్వీ!!
ఈ సమయంలో ఆయన సీక్రెట్ రిలేషన్ గురించి ఒక వార్త బయటకు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్నారని మనకు తెలుసు. 1986లో నటి రీనా దత్తాను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకుల ద్వారా దూరమయ్యారు. ఆ తర్వాత 2005లో తన వ్యక్తిగత సహాయకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. దాదాపుగా 15 సంవత్సరాలు కాపురం చేసి 2001లో విడిపోయారు. వీరిద్దరు సరోగసి ద్వారా ఒకరికి జన్మనిచ్చారు..
ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకొని వారికి దూరమైనటువంటి అమీర్ ఖాన్ తాజాగా బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని ఈ మధ్యకాలంలోనే ఆ అమ్మాయిని తన కుటుంబానికి కూడా పరిచయం చేశారని ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, ఆమెతో అమీర్ ఖాన్ చాలా డీప్ రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది.. అమీర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే సితారే జమీన్ పర్ 2025 డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.( Aamir Khan)