Aarti Agarwal: ఆర్తి అగర్వాల్ చివరి మాటలు.. చావుకు కారణం చెబుతూ ఎమోషనల్ అయినా అమ్మా రాజశేఖర్.?
Aarti Agarwal: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అంద చెందాలతో ఊపు ఊపిన హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. చూడడానికి కాస్త బొద్దుగా ఉన్న అప్పట్లో కుర్రకారుకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ గా మారింది. ఈమె సినిమాల్లో వస్తుంది అంటే థియేటర్లు ఫుల్ అయిపోయేవి. అలా తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెంది అభిమానులను కలవరపరిచింది. ఆర్తి అగర్వాల్ అకస్మాత్తుగా మరణించడానికి కారణాలేంటి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Aarti Agarwal last words Amma Rajasekhar was emotional
16 సంవత్సరాలకి సినీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టింది ఆర్తి.. ముందుగా బాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. అప్పట్లో ఈమె అందం, కలువళ్లాంటి కళ్ళను చూసి చాలామంది దర్శక నిర్మాతలు మెస్మరైజ్ అయిపోయారట. అయితే ఈమె మొదటి సినిమాతోనే తెలుగులో అద్భుత విజయాన్ని అందుకోవడంతో వరుస ఆఫర్లు తన్నుకుంటూ వచ్చాయట.(Aarti Agarwal)
Also Read: Naga Chaitanya: ఇంట్లో పెత్తనమంతా శోభితదే అమల కూడా వేస్టేనా..?
అలా చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, తరుణ్, బాలకృష్ణ, రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు అందరితో ఆమె జతకట్టింది. ఇందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆర్తి పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి ఈమె 2015 జూన్ 6న గుండెపోటుతో మరణించింది. అయితే ఇది మరణానికి సంబంధించి దర్శకుడు అమ్మ రాజశేఖర్ షాకింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో రణం2 అనే సినిమాలో ఆర్తి అగర్వాల్ నటించింది.
ఇందులో కీలక పాత్రలో శ్రీహరి. అయితే ఆమెకు అనారోగ్య సమస్యల వల్ల ఆరు నెలల పాటు షూటింగ్ గ్యాప్ ఇచ్చిందట. ఈ ఆరు నెలల్లో ఆమె విపరీతంగా వెయిట్ పెరిగిందని, షూటింగ్ స్పాట్ లోకి వచ్చి ఇక నావల్ల కాదు అంటూ ఏడ్చేసిందని అమ్మ రాజశేఖర్ చెప్పుకోచ్చారు.. అంతేకాదు తక్షణమే బరువు తగ్గడం కోసం ఆమె లైపోస్సాక్షన్ అనే సర్జరీ చేయించుకొని తన ప్రాణాల మీదికి తెచ్చుకుందన్నారు. ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయి ఆమె మరణించిందని తెలియజేశారు.(Aarti Agarwal)