Abhinaya: హైదరాబాద్ కుర్రాడినే పెళ్లాడబోతున్న అభినయ.. బ్యాగ్రౌండ్ గట్టిగానే.?

Abhinaya: కృషి పట్టుదల ఉండాలే కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిన అనుకున్నది సాధించే తీరుతాం.. కానీ కొంతమంది అన్ని రకాల సదుపాయాలు ఉన్న, సక్సెస్ కావడంలో మాత్రమే వెనకబడి పోతూ ఉంటారు. వారి సక్సెస్ కు ఎవరో అడ్డుపడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ మాత్రం చెవులు వినపడకపోయినా, మాట రాకపోయినా కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే అభినయ..
Abhinaya is going to marry a Hyderabad boy
ఈమె రూపం చూస్తే ఆమెకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయ్ అంటే ఎవరు నమ్మరు. ఎంతో అందంగా చక్కని రూపంతో కనిపించే అభినయకు పూర్తిగా చెవులు వినపడవు, మాటలు రావు. అయినా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటిస్తుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ చెల్లి పాత్రలు చేసుకుంటూ ఎంతో ఫేమస్ అయింది. తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తూ తనకు ఎదురులేరు అనిపించుకుంటుంది. కొంతమంది దర్శక నిర్మాతలు అయితే ఈమె టాలెంట్ ను మెచ్చి హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చారు. (Abhinaya)
Also Read: Prema: ఆ డైరెక్టర్ నా జీవితం సర్వనాశనం చేశాడు.?
దర్శకులు ఎలాంటి పాత్రలో చేయమంటే ఆ పాత్రలో ఆమె నటించడం కాదు జీవించేస్తుంది. ఆ విధంగా తనకున్నటువంటి సమస్యను మరచిపోయి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి అభినయ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది..ఆ అబ్బాయి ఎవరు వివరాలు చూద్దాం.. అభినయ అప్పట్లో హీరో విశాల్ తో ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది అభినయ. గత 15 సంవత్సరాల నుంచి వీరు ప్రేమలో ఉన్నారట.

ఇంతకీ ఆమె చేసుకోబోతున్న అబ్బాయి ఎవరయ్యా అంటే కార్తీక్.. ఈయన హైదరాబాదులోనే పుట్టి పెరిగారట. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కార్తీక్ తన తండ్రి బిజినెస్ లు చూసుకుంటూ ఆ రంగంలోని రాణిస్తున్నారట. వీరిద్దరూ గత 15 సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నట్టు త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా అభినయ వీరిద్దరు దిగినటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.(Abhinaya)