Abhinaya: పెళ్లి పీటలెక్కబోతున్న అభినయ.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే.?

Abhinaya: ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు అన్ని సక్రమంగా ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఎదగలేకపోతున్నారు. కానీ ఈ నటీమని మాత్రం చాలా డిఫరెంట్. కనీసం ఆమెకు చెప్పింది వినబడదు. చెప్పడానికి మాటలు రావు అలా చెవిటి, మూగతో బాధపడుతున్నా కానీ నటనకు ఇవేవీ అడ్డం కాదని నిరూపించింది హీరోయిన్ అభినయ..

 Abhinaya who is going to get married

Abhinaya who is going to get married

శంభో శివ శంభో అనే చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో సినిమాల్లో దూసుకుపోతోంది. ఏదైనా సైగల ద్వారానే చెప్పే ఈమెను చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. 33 సంవత్సరాలు ఉన్నటువంటి అభినయ ప్రేమ పెళ్లి గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. (Abhinaya)

Also Read: Sankranti Ki Vostunnam OTT: ఓటీటీ లోకి ఆలస్యంగా సంక్రాంతికి వస్తున్నాం.. అసలు విషయం ఇదే!!

దీనిపై స్పందించిన అభినయ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అదేవిధంగా విశాల్ తో ప్రేమలో ఉందని ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తాయి. ఈ వార్తలపై చాలాసార్లు అభినయ స్పందించి అవేవీ లేవని చెప్పింది.. ఇదే తరుణంలో ఇన్నేళ్లయిన మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని యాంకర్ ప్రశ్నించగా..

 Abhinaya who is going to get married

ఆమె ఏమాత్రం భయపడకుండా తాను 15 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, మేము కలిసే చదువుకున్నామని, త్వరలో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నానని అభినయ ప్రకటించింది. ఈ విధంగా అభినయ తన పెళ్లి విషయాన్ని బయట పెట్టడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అభినయ త్వరలో ఓ ఇంటిది కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.(Abhinaya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *