Abhishek Sharma: దుమ్ములేపిన SRH డేంజర్ బ్యాటర్.. 28 బంతుల్లో సెంచరీ ?
Abhishek Sharma: హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ము లేపాడు. 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా… చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ… గత సీజన్లో అద్భుతంగా రాణించాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా… టీమిండియాలోకి వెళ్ళాడు అభిషేక్ శర్మ. Abhishek Sharma
Abhishek Sharma matches Urvil Patel, hits joint-fastest T20 hundred by Indian
ఇప్పుడు టీమిండియా టి20 ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు అభిషేక్ శర్మ. ఇక అభిషేక్ శర్మ గ్రౌండ్లోకి దిగాడు అంటే కచ్చితంగా సిక్సులు లేదా ఫోన్లు కొడతాడు. లేదా అవుట్ అయి ఇంటికి వెళ్తాడు. అయితే అలాంటి అభిషేక్ శర్మ తాజాగా… సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో పంజాబ్ వర్సెస్ మేఘాలయ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ… 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 11 సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. 365 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు. Abhishek Sharma
Also Read: Aryaman Birla: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని కోహ్లీని మించిన సంపద ?
మొదటి బ్యాటింగ్ చేసిన మేఘాలయ 142 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అభిషేక్ శర్మ సెంచరీ తో దుమ్ము లేపాడు. దీంతో పంజాబ్ అవలీలగా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మకు దక్కింది.