Vidadala Rajini: ఏ క్షణమైనా విడదల రజిని అరెస్ట్ ?
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసిపి నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాత కేసులు తిరగేసి… ఒక్కొక్కరిని బొక్కలో వేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది వైసిపి కీలక నేతలను జైలుకు పంపింది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి విడుదల రజిని పై ఏసీబీ కేసు నమోదు అయింది.

ACB Case on Vidadala Rajini
Nara Lokesh: నారా లోకేష్ చేతిలో ఎన్టీఆర్ ప్లెక్సీ ?
చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి విడదల రజిని డబ్బులు వసూలు చేశారట. ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
Also Read: Telangana: ఒకే వేదికపై కేటీఆర్, సీఎం రేవంత్..జగన్ మిస్సింగ్ ?
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు కాగానే బాధితుడు ఫిర్యాదు చేశాడట. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… వెంటనే ఏ వన్ గా విడుదల రజిని పేరు నమోదు చేసుకున్నారు. A2 ముద్దాయిగా ఐపీఎస్ అధికారి జాషువా పైన కూడా కేసు నమోదు అయింది. ఆ తర్వాత ఏ త్రీ గా విడుదల గోపి , ఏ ఫోర్ గా రామకృష్ణ పేర్లు ఉన్నాయి. అయితే ఈ కేసులో భాగంగా త్వరలోనే విడదల రజనీకి నోటీసులు కూడా జారీ కాబోతున్నాయట. దీనిపై సమాధానం చెప్పకపోతే విడదల రజిని అరెస్టు అయ్యే ప్రమాదం కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
Jagan: ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ