Murali Mohan: ఒకప్పటి హీరో అండ్ నటనకి మారుపేరు అయినటువంటి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హీన పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీనటులకు ” కళాదేవిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ” అందించారు. ఇక 2023 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డ్స్ అందజేశారు. హైదరాబాద్లోని హోటల్ … దసపల్లా లో ఎన్టీఆర్ ఫిలిమ్స్ అవార్డుల ప్రారంభోత్సవం జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ పాటతో ప్రారంభించారు.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూపా, సీనియర్ నటుడు మురళీమోహన్, తెలుగు చలనచిత్రం నిర్మాణ మండలి అధ్యక్షులు శ్రీకే. ఎల్. దామోదర్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ..” ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రేక్షకులకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘన విజయాన్ని అందుకున్న నటుడు ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు.
ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరా గాంధీని ఎదుర్కొని నిలబడటం అంతా తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ” అంటూ మురళీమోహన్ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ ఈన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.