Pavani Reddy wedding: భర్త ఆత్మహత్య తర్వాత రెండో వివాహం చేసుకోబోతున్న నటి పావని రెడ్డి!!

Pavani Reddy wedding: టాలీవుడ్ బ్యూటీ పావని రెడ్డి మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఒకరికొకరు తోడుగా ఉంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నాం. ఇకపై కలిసి జీవిద్దాం” అంటూ తన Instagram ఖాతాలో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈనెల 20న ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆమిర్‌తో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు పావని-ఆమిర్ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Actress Pavani Reddy wedding update
ఇప్పటికే పావని రెడ్డి ఓ వివాహ బంధంలో ఉన్నారు. 2013లో తెలుగు నటుడు ప్రదీప్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 2017లో ప్రదీప్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పట్లో “పావని మరొకరితో చనువుగా ఉండటం వల్లే ఇది జరిగింది” అనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయంలో ఆమె ఎప్పుడూ స్పందించలేదు.
తర్వాత తమిళ Bigg Boss 5 లో పాల్గొన్న పావని, సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ఇదే షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్ తో ఆమె ప్రేమలో పడారు. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం నిజమవుతూ ఇప్పుడు పెళ్లితో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.
సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన పావని Double Trouble, Dream, Gauravam, Tunivu (Thegimp) & Chari 111 వంటి సినిమాల్లో నటించారు. తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.