Rajinikanth: భార్య అని చెప్పి ఆ హీరో నన్ను మోసం చేశాడు.. రజినీకాంత్ పై నటి షాకింగ్ కామెంట్స్.?

Rajinikanth: సినీ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం వచ్చే వారిని అనేక రకాలుగా మోసం చేసిన సందర్భాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఫిమేల్ నటులైతే ఇండస్ట్రీలో రాణించడం కోసం దర్శక నిర్మాతలు హీరోల చేతిలో మోసపోయిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. ఆ విధంగానే ఒక సీనియర్ నటి కూడా ఒక పాత్ర కోసం దారుణంగా మోసపోయింది. అంతేకాదు తాను ఒక వీడియో కాల్ ద్వారా వారికి అంతా చూపించింది. ఇంతకీ ఆమె ఎవరు వివరాలు చూద్దాం..
Actress shocking comments on Rajinikanth
మలయాళ ఇండస్ట్రీలో తల్లి, వదిన, అత్త, అక్క, ఇలా రకరకాల పాత్రల్లో చేస్తూ మంచి గుర్తింపు పొందింది షైనీ సారా.. అయితే ఈమెకు ఓసారి రజనీకాంత్ తో నటించే అవకాశం ఇస్తానని కొంతమంది వ్యక్తులు వాట్సాప్ ద్వారా తెలియజేశారు.. ఈ ఆఫర్ ఇవ్వడానికి ఆర్టిస్ట్ కార్డు అనేది ఉంటుందని దానికోసం 12,500 చెల్లిస్తే కార్డు అందించి మీకు రజనీకాంత్ భార్యగా నటించే అవకాశం కల్పిస్తామని అన్నారట. ఇది నిజమని నమ్మిన షైనీసారా మీరు ఒక సినిమాలో రజనీకాంత్ భార్యగా చేయడానికి అవకాశం వచ్చిందని వాట్సప్ ద్వారా మెసేజ్ వచ్చిందట.(Rajinikanth)
Also Read: Sreeleela: ఆ హీరోతో శ్రీలీల పెళ్లి ఫిక్స్.. నిజం బయటపెట్టిన హీరో తల్లి.?
నీకు ఆర్టిస్ట్ కార్డు ఉందా అని వారు అడిగారట, మా ఇండస్ట్రీలో అలాంటి కార్డ్స్ ఏమీ ఉండవని షైనీసారా చెప్పడంతో, నీకు మేము కార్డు అరేంజ్ చేస్తామని తర్వాత మీకు సురేష్ కుమార్ సెల్ ఫోన్ నుండి కాల్ వస్తుందని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే నాకు సురేష్ కుమార్ నుంచి వీడియో కాల్ వచ్చింది. నేను అప్పటికే చీర కట్టుకొని రెడీ అయి ఉన్నాను, వీడియో కాల్ లో నన్ను పూర్తిగా చూసి సెలెక్ట్ అయ్యారని చెప్పారు. అది కూడా జైలర్ 2 సినిమాలో రజనీకాంత్ భార్యగా మిమ్మల్ని తీసుకుంటామని అన్నారు.

దీంతో నేను కాస్త అనుమానపడి జైలర్ 2 లో రమ్యకృష్ణ భార్యగా సెలెక్ట్ అయింది కదా అని ప్రశ్నించగా, అది కాదండి వేరే సినిమాలో మీరు భార్యగా చేస్తారని వాళ్ళు బదులిచ్చారు. అంతేకాదు మీకు ఆర్టిస్ట్ కార్డు తీసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ మెయిల్ ద్వారా వస్తుంది దాని కోసం డబ్బులు ఖర్చవుతాయని వారు చెప్పారు. ఇదంతా ఏదో మోసంలా ఉందని గ్రహించి నేను డబ్బులు మాత్రం పంపించలేదు. తర్వాత ఈ విషయం గురించి అక్కడ ఇక్కడ తెలుసుకుంటే ఇదంతా మోసం అని వాళ్ళు అలాగే కాల్ చేసి డబ్బులు నొక్కేస్తారని తెలిసింది. ఈ విధంగా నేను కాస్టింగ్ కాల్ వల్ల మోసపోయానని ఆమె అన్నది.(Rajinikanth)