Actress Sneha: ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టుకోనంటున్న స్నేహ.. కారణం ఏంటో తెలుసా..
Actress Sneha: ఒకప్పుడు దక్షిణ భారత సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన స్నేహ, గ్లామర్ షోకు దూరంగా సంప్రదాయ పాత్రలతో వరుస విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో కనిపించి, తన నటనతో విశేషమైన ఫాలోయింగ్‌ను సంపాదించింది. తొలి వలపు సినిమాతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన స్నేహ, గోపాలం, శ్రీరామదాసు, రాజన్న వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Actress Sneha Saree Business in Chennai
తమిళ నటుడు ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకున్న స్నేహ, పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి తన కుటుంబంతో గడిపారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స్నేహ, ఇప్పుడు హీరో, హీరోయిన్‌లకు అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కెరీర్ పరంగా మాత్రమే కాకుండా, ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న స్నేహ, ఇటీవల పోస్ట్ చేసిన చిత్రాలు వైరల్ అవుతూ మంచి స్పందనను పొందాయి.
మునుపట్లో ఒక మ్యాగజైన్‌లో స్నేహ గురించి వచ్చిన వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆమె ఒకసారి ధరించిన దుస్తులనే మళ్లీ ధరిస్తారని విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటినుంచి తాను ఒకసారి ధరించిన దుస్తులను మళ్లీ ధరించనని నిర్ణయించుకున్నారు. ఇవి ఆమె సొంత స్టైల్‌ను, వ్యక్తిగత నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తుంది.
ప్రస్తుతం స్నేహ ఒక కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో స్నేహాలయం పేరుతో చీరల మాల్‌ను ప్రారంభించి, వ్యాపార రంగంలోనూ తన ప్రతిభను చూపిస్తున్నారు. చీరల డిజైన్, కస్టమర్ ఇష్టాలకు అనుగుణంగా నూతన శైలిని పరిచయం చేయడంలో ఆమె ప్రత్యేకత కనిపిస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, కొత్త పాత్రల్లో నటిస్తూ, వ్యాపారంలో అవకాశాలను అన్వేషిస్తూ స్నేహ మరోసారి తన ప్రయాణాన్ని కొత్త దిశగా మలిచారు.