Aditi Shankar: ఆ కండిషన్ వల్లే సినిమాల్లోకి రావడానికి నాన్న ఒప్పుకున్నాడు.. శంకర్ కుమార్తె అదితి!!
Aditi Shankar: అదితి శంకర్.. తమిళ సినిమా విరుమన్ ద్వారా నటిగా పరిచయమైన ఆ యువ నటి, ఇప్పుడు తన తాజా చిత్రం నేసిప్పాయ్ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమా తెలుగులో ప్రేమిస్తావా పేరుతో విడుదల కానుంది. అదితి తన సినిమా ప్రయాణం, అవకాశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Aditi Shankar Talks About Her Career
అదితి సినిమాల్లోకి రావడానికి ముందు మెడిసిన్ పూర్తి చేయగా, ఆమె తండ్రి శంకర్‌ను అడిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తనకు శంకర్ ఒక షరతు విధించాడని, ఆ షరతుకు ఒప్పుకుని సినిమాల్లోకి అడుగుపెట్టినట్లు ఆమె వెల్లడించింది. తిరిగి వైద్య వృత్తికి వెళ్లాలని ఆమె తండ్రి సూచించాడని, కానీ తాను సినిమాల్లో అవకాశాలను సాధించేందుకు ఎప్పటికప్పుడు ఆడిషన్లకు వెళతానని చెప్పింది.
తండ్రి పేరుతో అవకాశాలు పొందడం తనకు ఇష్టం లేదని, అది తనకు సంతోషాన్ని ఇవ్వదు అని అదితి స్పష్టం చేసింది. నటన మీద ఆసక్తితోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, డబ్బు కోసం ఎలాంటి అవకాశాలు తీసుకోలేదని పేర్కొంది. తండ్రి శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని తన మనసులో ఉందని కూడా తెలిపింది. ప్రస్తుతం ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో నటిస్తున్న చిత్రంలో భాగమవుతోంది.