Aishwarya Rajesh: జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న ఐశ్వర్య రాజేష్.. ఎందుకంటే.?
Aishwarya Rajesh: సంక్రాంతి వస్తున్నాం… ఈ సంక్రాంతి కి వస్తున్న స్టార్ హీరోల్లో మూవీలలో వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం కూడా ఉంది. భారీ హైప్ తో వస్తున్న డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ పోటీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. ఈ సినిమా ఈ రెండు సినిమాల కంటే బాగుంటుంది అని ఈ చిత్ర ట్రైలర్ చూసిన చాలా మంది అనుకుంటున్నారు. ఇక సినిమా ఎలా ఉంటుందో రిజల్ట్ విడుదల అయ్యేవరకు ఎవరు చెప్పలేం. అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ మాత్రం వరుస ప్రమోషన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు.
Aishwarya Rajesh laid hands on the journalist
ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య రాజేష్,వెంకటేష్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలన్నింటికీ వెంకటేష్,ఐశ్వర్య రాజేష్ లు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కి భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ సినిమాలో తరచూ ఆయనను కొడుతూ ఉంటుంది.అలా ఈ సినిమా కి సంబంధించిన ఈవెంట్ లో కూడా ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ ని సరదాగా కొడుతుంది. అయితే ఈ విషయం గురించి ఐశ్వర్య రాజేష్ ని జర్నలిస్టు ప్రశ్నించారు.(Aishwarya Rajesh)
Also Read: Namrata: మహేష్ బాబు భార్య బాత్రూం సాంగ్ లీక్.. హీట్ పుట్టిస్తున్న నమ్రత.?
మీరు ప్రతిసారి వెంకటేష్ గారిని కొడుతున్నారు కదాఅని అడగగా.. అవును నిజంగానే కొట్టాను.ఎందుకు మిమ్మల్ని కూడా కొట్టాలా అంటూ వెంకటేష్ ని భుజం మీద కొట్టినట్టుగానే ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టును కూడా సరదాగా కొట్టింది. అయితే ఇది ఫన్నీ గానే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.గడుసు పెళ్ళాం అయినటువంటి భాగ్యం పాత్రలో నటించింది.ఈ పాత్రను మరో ఐదారు సంవత్సరాల వరకు తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారని ఐశ్వర్య చెప్పింది.
అలాగే ఈ సినిమాలోని భాగ్యం పాత్రలో నటించేటప్పుడు చాలా భయపడ్డానని అలాగే పెద్ద హీరోతో ఇప్పటివరకు అలా ఎక్కువసేపు నటించే అవకాశాలు నాకు రాలేదు.కానీ వెంకటేష్ తో సినిమా అనగానే ముందుగా నాకు భయమేసింది. అలాగే ఈ సినిమాకి వెంకటేష్ ముందు డైలాగులు చెప్పాలంటే భయపడిపోయాను. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది.కానీ అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.(Aishwarya Rajesh)