Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ పెళ్లి.. అబ్బాయి కూడా తెలుగువారేనా..హింట్ ఇచ్చిన హీరోయిన్ తల్లి..?
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ ఏ సినిమాలో నటించిన ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్టే అవుతోంది.. మంచి మెసేజ్ ఇచ్చే కథాంశాలతో మన ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు జాతికి చెందిన అమ్మాయి.
అయినా ఈ అమ్మడు తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ చాలా పాపులారిటీ సంపాదించుకుంది.. అలాంటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది..

Aishwarya Rajesh wedding
అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ద్వారా తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైనటువంటి పేజీలను రాసుకుంది.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరని చెప్పవచ్చు.. అలాంటి ఈ అందాల రాశి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఐశ్వర్య రాజేష్ తల్లి కూడా తన పెళ్లిపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.. (Aishwarya Rajesh)
Also Read: Samantha: అందరూ అనుకుందే చేసింది.. రెండో పెళ్లి పై సమంత సడెన్ ట్విస్ట్.?
2026 లో ఐశ్వర్య పెళ్లి తప్పకుండా చేస్తామని ఆమె అన్నది.. ఒక మంచి అబ్బాయి కోసమే మేము చూస్తున్నామని ఆమె తెలియజేసింది.. తెలుగు అబ్బాయి అయితే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చింది.. ఐశ్వర్య సినిమాల గురించి ఆమె చెబుతూ అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్ళింది. అక్కడ స్టార్ గా ఎదిగింది.

తర్వాత తెలుగులో ఒక్కొక్క అవకాశం దొరుకుతుంది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగువారు ఈ విధంగానే నా కూతురును ఆదరించి మరిన్ని హిట్లు ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా ఐశ్వర్య రాజేష్ నటన భలే ఉంటుందని చాలామంది నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.. అంతేకాకుండా మరి ఏమని కట్టుకోబోయే తెలుగు హీరో ఎవరు అనేది కూడా చాలామంది ఆలోచన చేస్తున్నారు.(Aishwarya Rajesh)