Ajith: శాలిని కంటే ముందే ఆమెను ప్రేమించా.. కానీ డ్రగ్స్ తాగుతూ.?
Ajith: సౌత్ హీరో అజిత్ కుమార్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈయన రీసెంట్గా దుబాయ్ లో జరిగిన 24H రేసింగ్ పోటీలో పాల్గొని మూడో ప్లేస్ సంపాదించుకున్నారు.దాంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఈయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఓవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు కార్ రేసింగ్ లో కూడా ఈయన సత్తా చాటుతున్నారు.
Ajith lovestory before marraige
అయితే అలాంటి అజిత్ కుమార్ గురించి గతంలో జరిగిన కొన్ని ప్రేమ విషయాలు బయటపడుతున్నాయి. ఇక అజిత్ కుమార్ హీరోయిన్ శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకోక ముందు కొంతమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించారు. అలాంటి వారిలో హీరా రాజగోపాల్ ఒకరు.. అజిత్ హీరా రాజగోపాల్ లు కథల్ కొట్టయ్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య బాండింగ్ పెరిగి ప్రేమగా మారింది.(Ajith)
Also Read: Sankrantiki Vasthunnam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ.. అదే పెద్ద మైనస్..?
అలా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం పెళ్లి వరకు వెళ్ళింది.కానీ కొన్ని కారణాలవల్ల వీరి మధ్య బ్రేకప్ జరిగింది. అయితే ఓ ఇంటర్వ్యూలో అజిత్ హీరాతో ప్రేమ విషయాన్ని బయట పెడుతూ.. నేను హీరా రాజగోపాల్ ని ప్రేమించిన విషయం నిజమే. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది నిజమే. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఒకప్పుడు హీరా వజ్రంలా ఉండేది.కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది.
ఆమె మాదకద్రవ్యాలకు బానిసయ్యింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు అజిత్. ఇక హీరా అజిత్ లు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ హీరా తల్లి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తన కూతురు ఏజ్ చిన్నదని, ఇప్పుడే సినిమాల్లో రాణిస్తోంది. అలాంటిది పెళ్లి చేసుకుంటే ఆమె కెరీర్ నాశనం అవుతుంది అని చెప్పి వీరి పెళ్లి కాకుండా చేసిందట.ఆ తర్వాత అజిత్ హీరా ల మధ్య బ్రేకప్ జరిగింది.(Ajith)