Vidaamuyarchi Trailer: అజిత్ ‘విడాముయర్చి’ వేరే లెవెల్ లో ఉంటుందట!!
Vidaamuyarchi Trailer: కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ “విడాముయర్చి”పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ట్రైలర్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.
Ajith Vidaamuyarchi trailer praised highly
తన డైరెక్షన్లో వస్తున్న “ఎల్2: ఎంపురాన్” ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడిన పృథ్వీరాజ్, “విడాముయర్చి” ట్రైలర్‌ను ఇప్పటికే చూశానని వెల్లడించారు. ఇది తాను ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో చూసిన అత్యుత్తమ ట్రైలర్లలో ఒకటిగా పేర్కొన్నారు. ట్రైలర్ అద్భుతంగా రూపొందించబడిందని ప్రశంసించారు. ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, విడాముయర్చి టీమ్‌కు ఘన విజయం కావాలని కోరుకున్నానని తెలిపారు.
విడాముయర్చి సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది, అదే సంస్థ “ఎంపురాన్”ను కూడా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో అర్జున్, రెజీనా కసాండ్రా, అరవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ట్రైలర్‌పై పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చిత్రంపై మరింత ఆసక్తిని పెంచాయి. యాక్షన్ ప్రధానంగా సాగే కథ, అద్భుతమైన తారాగణం, అనిరుధ్ సంగీతం కలిసి “విడాముయర్చి”ను బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించే సినిమాగా నిలబెడతాయని భావిస్తున్నారు.