Akhanda Thaandavam: రుద్ర సికిందర్ అఘోరా.. బోయపాటి శ్రీను అఖండ 2పై స్పెషల్ ప్లాన్!!

Akhanda Thaandavam: నటసింహం నందమూరి బాలకృష్ణ తన బ్లాక్‌బస్టర్ చిత్రం అఖండ సీక్వెల్ ‘అఖండ – తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని దసరా పండగ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేస్తుండగా, అఘోరా పాత్ర భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందట.
Akhanda Thaandavam Shooting in Full Swing
కొన్ని కీలకమైన యాక్షన్ సీన్లు మినహా, అఘోరా పాత్రకు సంబంధించిన భాగాన్ని బోయపాటి ఫినిష్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ‘ఆదిత్య 369’ రీ-రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇది అఖండ 2లో మరో పాత్ర కోసం అని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మిగిలిన యాక్షన్ సన్నివేశాలను బాడీ డబుల్స్‌తో పూర్తి చేసే అవకాశం ఉంది. త్వరలోనే మరో కీలక పాత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ బిగ్ హిట్ కాగా, ఈ సీక్వెల్‌లో ఇంకా పవర్‌ఫుల్ బీజీఎమ్ ఉండబోతుందని తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకుంది.
జూన్ నాటికి మొత్తం టాకీ పార్ట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తిచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ మరోసారి మాస్ ఆడియన్స్‌ను ఊపుతుందా? వేచి చూడాలి!