Akhil: అఖిల్ కాబోయే భార్యకి ఆ రాజకీయ నాయకుడికి ఉన్న సంబంధం ఇదేనా..?
Akhil: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని అఖిల్ కు సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. ఆయన జైనబ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా ప్రకటించడంతో ఆమె గురించి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నెటిజన్స్. ఇదే టైంలో చాలా ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Akhil fiancee relationship with that politician is this
అయితే జైనబ్ పూర్తిగా విదేశాల్లోనే పెరిగిందని, చిత్రలేఖనంలో దిట్టా అని తెలుస్తోంది. అలాంటి జైనబ్ ఫ్యామిలీకి ఆ రాజకీయ నాయకుడితో కూడా సంబంధాలు ఉన్నాయట. మరి ఆయన ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. జైనబ్ రావడ్జి అఖిల్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారట.. చివరికి వీరి ప్రేమను పెద్దలకు చెప్పగానే వారు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.(Akhil )
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై ఎమోషనల్ పోస్ట్!!
ఇలా వీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి జైనబ్ తండ్రి జుల్ఫీ నాగార్జున స్నేహితులట. అయితే జుల్ఫీ దుబాయ్, లండన్ ఇండియాతో పాటు అనేక వ్యాపారాలు ఉండడంతో ఆయన వ్యాపార పరంగా, రాజకీయపరంగా చాలా ఎదిగారట.
అంతేకాకుండా జుల్ఫీ జగన్ సీఎంగా ఉన్న సమయంలో కేబినెట్ ర్యాంకు హోదా కూడా పొందారట. అంటే ఆయన గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడ్డారట. ఇలా జుల్ఫీ ఫ్యామిలీకి మాజీ సీఎంతో ఎన్నో సంబంధాలు ఉన్నాయని, జైనబ్ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ కు తెలుసని నెట్టింటా వార్తలు వైరల్ అవుతున్నాయి..(Akhil )