Akkineni Akhil: అక్కినేని అఖిల్ జైనబ్ ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
Akkineni Akhil: అక్కినేని అఖిల్ జైనబ్ రావడ్జి ల ఎంగేజ్మెంట్ నవంబర్ 26న జరిగింది. అయితే వీరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ పిక్స్ నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి సడన్ సర్ప్రైస్ ఇచ్చారు. అప్పటివరకు నాగ చైతన్య శోభితల పెళ్లి గురించి అంతా మాట్లాడుకున్నారు. కానీ సడన్ సర్ప్రైజ్ గా నాగార్జున తన రెండో కొడుకుకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా షేర్ చేయడంతో ఎంతో మంది షాక్ అయిపోయారు. ఇక అక్కినేని అఖిల్ గతంలోనే శ్రియ భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత విడిపోయారు.
Akkineni Akhil Zainab wedding date fix
అయితే జైనబ్ తో చాలా రోజుల నుండి అఖిల్ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారట. కానీ ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు.కానీ ఎట్టకేలకు నాగార్జున ఫ్యామిలీ జైనబ్ ఫ్యామిలీ ఇద్దరూ వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో అఖిల్ జైనబ్ ల ఎంగేజ్మెంట్ చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిపోయింది. ఇక ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను నాగార్జున అమల అఖిల్ లు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. (Akkineni Akhil)
Also Read: Sr. NTR: రెండో భార్యతో పిల్లల కోసం ఎన్టీఆర్ స్టెరాయిడ్స్.. హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.?
ఇక ఈ ఫొటోస్ లో అఖిల్ కి కాబోయే భార్య చూడడానికి చాలా అందంగా ఉంది.కానీ ఒక విషయంలో మాత్రం అఖిల్ పై ట్రోల్స్ వచ్చాయి. అదేంటంటే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ రావడ్జి ఏజ్ అఖిల్ కంటే దాదాపు 11 ఏళ్లు పెద్దదని, తనకంటే వయసులో 11 ఏళ్లు పెద్దదైన అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి చాలామంది షాక్ అయ్యారు. ఇక వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఎంతోమంది గుసగుసలు పెట్టుకున్నారు.(Akkineni Akhil)
అయితే ప్రేమకి ఏజ్ తో సంబంధం లేదు అన్నట్లుగా వీరి జోడి అయితే చాలా బాగా కుదిరింది ఈ విషయం పక్కన పెడితే పెద్ద కొడుకు పెళ్లి చేసిన నాగార్జున చిన్న కొడుకు పెళ్లి కూడా అదే రోజు చేస్తారని ఊహగానాలు వినిపించాయి. కానీ అఖిల్ జైనబ్ ల పెళ్లి ఇప్పుడు ఉండదని నాగార్జున చెప్పారు. అయితే తాజాగా అఖిల్ జైనబ్ ల పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 24న ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు సినీ సర్కిల్స్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే అఖిల్ జైనబ్ ల పెళ్లి మార్చిలో జరగబోతుందా అనేది తెలియాలంటే అఫీషియల్ గా నాగార్జున ఫ్యామిలీ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.(Akkineni Akhil)