Toxic Movie: టాక్సిక్ లో ఇద్దరు హీరోయిన్ లతో యష్ రొమాన్స్!!
Toxic Movie: పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ “కేజీఎఫ్” తర్వాత, యష్ తన తదుపరి చిత్రంపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నాడు. అంతకుముందు అనేక సినిమాలపై ఆలోచన చేసిన ఆయన, “టాక్సిక్” అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రగ్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కే ఈ చిత్రం టీజర్ ద్వారా యష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది, మరియు యష్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Akshay Oberoi confirms Nayanthara Toxic Movie
ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే, ఇటీవల అక్షయ్ ఒబెరాయ్ ఒక ఇంటర్వ్యూలో నయనతార “టాక్సిక్” సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. నయనతార యష్ తో కలిసి షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో, నయనతార “టాక్సిక్” చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే, కియారా అద్వానీ గురించి వచ్చే వార్తలపై ఎలాంటి సమాచారం లేదు. ఈ సినిమాలో కియారా హీరోయిన్గా నటిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రం విశేషమైన అంచనాలతో ముందుకు సాగిపోతుంది. “టాక్సిక్” సినిమా పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
“టాక్సిక్” చిత్రం కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుండి వచ్చిన మరో భారీ ప్రాజెక్ట్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధిస్తుందో, సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి, “టాక్సిక్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నయనతార మరియు కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్ లు నటిస్తున్నరాన్ వార్తలు రావడం మరింత ఆసక్తికరంగా ఉంది.