Alia Bhatt: సైఫ్ అలీ ఖాన్ వల్ల తన కూతుర్ని దాచేసిన అలియా భట్.. కారణం..?
Alia Bhatt: ఏంటి సైఫ్ అలీఖాన్ వల్లే అలియాభట్ తన కూతుర్ని సీక్రెట్ గా దాచేసిందా.. ఇంతకీ సైఫ్ అలీ ఖాన్ కి అలియా భట్ కూతురికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. ఎందుకు అలియాభట్ సీక్రెట్ గా దాచేసింది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా స్టార్ సెలెబ్రెటీ హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగిన సంఘటన మనకు తెలిసిందే. అయితే దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి దాడి చేసారనే వార్తలు వినిపించాయి.

Alia Bhatt hid her daughter
అయితే ఈ దాడి విషయం పక్కన పెడితే తాజాగా అలియాభట్ తన కూతురికి సంబంధించిన ఫోటోలు అన్నీ సోషల్ మీడియా నుండి డిలీట్ చేసింది. అయితే ఎన్నో క్యూట్ ఫొటోస్ ని అభిమానులతో పంచుకున్న అలియా భట్ సడన్ గా తన కూతురి ఫొటోస్ ఎందుకు డిలీట్ చేసింది అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. అయితే ఈ అనుమానానికి ఒక ఆన్సర్ దొరికింది.(Alia Bhatt)
Also Read: Chiranjeevi: ఆ దర్శకురాలితో రహస్యంగా చిరంజీవి.. రెండు గంటలు రూమ్ లో ..?
అదేంటంటే అలియా భట్ తన కూతురు ఫొటోస్ ని డిలీట్ చేయడంతో రెడ్డిట్లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడి కారణంగానే అలియా భట్ తన కూతురిని చాలా సీక్రెట్ గా ఉంచాలి అని తన కూతురికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేసిందని, ఆ దాడి వల్లే తన కూతురి విషయంలో గొప్యత మెయిన్టైన్ చేయాలని అనుకుంటుంది అని రెడ్డిట్లో ఓ పోస్ట్ వైరల్ అయింది.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ చాలా మంది కూడా అలియా భట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ముందు చూపుతో అలియా భట్ వ్యవహరించిన తీరుకి శభాష్ అని మెచ్చుకోవాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అలియాభట్ తన కూతురు ఫోటోలను డిలీట్ చేయడం వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఆమె చెబితే కానీ తెలియదు.(Alia Bhatt)
https://www.instagram.com/p/DGpqnfZud16/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==