Manchu Family: మంచు ఫ్యామిలీ గొడవలన్నీ తూచ్.. కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసమే..?

Manchu family: గత నాలుగైదు రోజుల నుండి మంచు ఫ్యామిలీ గొడవలు మీడియాలో ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ గొడవలపై అతి పెద్ద ట్విస్ట్ బయటపడింది. అదేంటయ్యా అంటే ఈ గొడవలన్నీ ఉత్తుత్తేనని,కేవలం సినిమా ప్రమోషన్ కోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఇంతకీ ఈ గొడవలన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనా అనే ట్విస్ట్ ఎంటో ఇప్పుడు చూద్దాం..మంచు మనోజ్ కి మోహన్ బాబు కి విష్ణు కి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

All the Manchu family quarrels are just for the promotion of Kannappa movie

All the Manchu family quarrels are just for the promotion of Kannappa movie

మోహన్ బాబు విష్ణు ఒకవైపు అయితే మనోజ్ మరోవైపు అనేలా గొడవలు జరుగుతున్నాయి.ఈ గొడవల్లో మీడియాపై మోహన్ బాబు దాడి ఇలా ఎన్నో అనర్ధాలు జరిగిపోయాయి.అలాగే మోహన్ బాబు పై మనోజ్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే తాజాగా హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. ఇక ఆ ఫిర్యాదులో ఆయన ఏం పేర్కొన్నారు అంటే..మంచు విష్ణు పాన్ ఇండియా రేంజ్ లో నటిస్తున్న కన్నప్ప మూవీ ప్రమోషన్ కోసమే వీళ్ళు ఇలా గొడవలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. (Manchu family)

Also Read: Manchu Lakshmi Post: మోహన్ బాబు కుటుంబ కలహాలు.. మనోజ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంచు లక్ష్మీ!!

ఈ గొడవలు అన్ని అబద్ధాలే..వీరు కేవలం సినిమా ప్రమోషన్ కోసమే ఇలా డ్రామాలు ఆడుతున్నారు..అంటూ ఒక సంచలన విషయం ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదులో కేవలం మోహన్ బాబు పై మాత్రమే కాకుండా ఆయన కొడుకులైనటువంటి విష్ణు, మనోజ్ లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన తెలియజేశారు. దీంతో ఈ విషయం తెల్సిన చాలామంది ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఇలా కొత్త కొత్త ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.

All the Manchu family quarrels are just for the promotion of Kannappa movie

అలా మంచు ఫ్యామిలీ కూడా ఇలా గొడవలు అయితే సినిమాకి ప్రమోషన్ కూడా అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా చేశారని పలువురు భావిస్తున్నారు.అయితే మంచు విష్ణు సినిమా హిట్ కొట్టి ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయనకి మార్కెట్ కూడా లేదు. ఇలాంటి సమయంలో ఈ గొడవల వల్ల ఆయన మార్కెట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ డ్రామా చేశారని కొంతమంది భావిస్తున్నారు.(Manchu family)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *