Allu Aravind: అల్లు మెగా బంధం తెగినట్టేనా.. ప్రేమతో కాదు భయంతో అల్లు అరవింద్ ఆ పని.?


Allu Aravind: సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్స్ గురించి ఎలాంటి వార్తలు వచ్చిన అభిమానులకు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉంటుంది.. ముఖ్యంగా వారి గురించి ఏదైనా నెగటివ్ కనిపిస్తే చాలు సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తాయి.. అది నిజమా అబద్దమా అనేది చెక్ చేసుకోకుండానే కొంతమంది ఆకతాయిలు నిజంగానే జరిగినట్టే రాసేస్తూ ఉంటారు.. దానివల్ల ఇండస్ట్రీలోని కొన్ని కుటుంబాలు ఇబ్బందుల పాలైన ఘటనలు మనం చూశాం, చూస్తున్నాం..

Allu Aravind did it out of fear not out of love

Allu Aravind did it out of fear not out of love

అయితే తాజాగా మెగా హీరో రామ్ చరణ్ పై నిర్మాత అల్లు అరవింద్ నెగిటివ్ ప్రచారం చేశారని దారుణంగా కామెంట్లు చేశారని ఒక ప్రచారం జరుగుతోంది.. అయితే ఇదే విషయంపై అల్లు అరవింద్ స్పందించారు. ‘తండేల్ ‘ మూవీ పైరసీ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ఈ సినిమాకు సంబంధించి పైరసీ చేసిన వారిని అస్సలు వదిలిపెట్టేది లేదని కేసులు నమోదు చేయిస్తామని అన్నారు. (Allu Aravind)

Also Read: Rajamouli: రాజమౌళి హాలీవుడ్ డెబ్యూ..భారీ డీల్ కుదుర్చుకున్నారా?

ఇదే తరుణంలో ఒక జర్నలిస్టు మీరు రామ్ చరణ్ చిత్రాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడాలని అన్నారు.. దీంతో అల్లు అరవింద్ రామ్ చరణ్ నా కొడుకు లాంటివాడు.. నాకు ఉన్నటువంటి ఏకైక మేనల్లుడు మా రామ్ చరణ్ మాత్రమే అని ప్రస్తావించారు.. నేను ఆరోజు నిర్మాత దిల్ రాజు కష్టాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఆ మాటలు మాట్లాడాను.. అవి అనుకోకుండా వచ్చిన మాటలే తప్ప కావాలని అన్నది కావు.. అసలు నా మేనల్లుడు గురించి నేను ఏ విధమైన మాటలను మాట్లాడలేదు..

Allu Aravind did it out of fear not out of love

ఆయనకు నాకు మంచి బంధం ఉంది. ఈ బంధాన్ని చెడగొట్టకండి దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి అంటూ అల్లు అరవింద్ అన్నారు. ప్రస్తుతం ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. ఇక తండేల్ సినిమా విషయానికొస్తే సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోందని చెప్పవచ్చు.. ఇది నాగచైతన్య సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకోవచ్చు.. అయితే ఈ మాటలు అల్లు అరవింద్ రామ్ చరణ్ పై ప్రేమతో కాదు.తన సినిమాకి ఎక్కడ నెగిటివ్ టాక్ వస్తుందోనని మెగా ఫ్యాన్స్ వల్ల ఎక్కడ సినిమాకి దెబ్బ కొడుతుందోనన్న భయంతోనే క్షమాపణలు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.(Allu Aravind)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *