Allu Aravind: రేవంత్ రెడ్డిని కలవబోతున్న అల్లు అరవింద్.. కేసు నుండి బన్నీ గట్టెక్కుతాడా.?

Allu Aravind: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఆ బరువు మోస్తుందని ఇప్పటికే స్టార్ హీరోల అభిమానులు గుసగుసలు పెట్టుకుంటున్నారు.ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పిదం వల్ల బెనిఫిట్ షోలు తీసివేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Allu Aravind who is going to meet Revanth Reddy

Allu Aravind who is going to meet Revanth Reddy

దీంతో చాలామంది భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు భయపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వార్త మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డిని అల్లు అరవింద్ కలవబోతున్నారట. మరి అల్లు అరవింద్ సీఎం ని కలవడానికి కారణం బన్నీని కేసు నుండి బయటపడేయడానికేనా అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా సంధ్యా థియేటర్లో పుష్ప టు విడుదల సమయంలో జరిగిన ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు ఎత్తివేసింది.(Allu Aravind)

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఏడుపు చూసి నవ్వుకుంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్..?

ఈ నేపథ్యంలోనే రేపు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అంటే అల్లు అరవింద్, దిల్ రాజు, చిరంజీవి,వెంకటేష్ వంటి ఇండస్ట్రీ పెద్దలు రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ అవబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఇక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి తో పాటు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డి లు కూడా రాబోతున్నారు తెలుస్తోంది.

Allu Aravind who is going to meet Revanth Reddy

ఇక ఈ సమావేశంలో టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు గురించి టాలీవుడ్ సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.మరి ఈ సమావేశంలో అల్లు అరవింద్ కూడా పాల్గొంటారు కాబట్టి అల్లు అర్జున్ కేసు గురించి సీఎం అలాగే మంత్రులతో ఏమైనా మాట్లాడతారా.. ఈ కేసు నుండి బన్నీని గట్టెక్కించమని అడుగుతారా అనేది తెలియాల్సి ఉంది.(Allu Aravind)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *