Allu Arjun: టైం చూసి మెగా హీరోలను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్..?
Allu Arjun: అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మళ్ళి కలిసిపోయింది .అయితే లోపల ఏముందో కానీ బయటికి మాత్రం నవ్వుతూనే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నాగబాబు, చిరంజీవిలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం. అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చాక అల్లు అర్జున్ నేరుగా చిరంజీవి నాగబాబుల ఇంటికి వెళ్లి కలవడం వంటివి జరిగాయి.
Allu Arjun beat the mega heroes by looking at the time
ఈ విషయం పక్కన పెడితే టైం చూసి బన్నీ మెగా ఫ్యామిలీని దెబ్బ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.అది ఎందుకంటే..రీసెంట్గా పుష్ప టు విడుదల సమయంలో జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో రీసెంట్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇప్పటినుండి తెలంగాణ గవర్నమెంట్ సినిమాలకు బెనిఫిట్ షో రద్దు చేస్తున్నట్టు, అలాగే టికెట్ రేటు కూడా ఎక్కువగా పెంచబోమంటూ ఖరాకండిగా చెప్పేసారు.(Allu Arjun)
Also Read: Nithya Menon: విడాకులు తీసుకోబోతున్న హీరోతో నిత్యమీనన్ అలాంటి పని..?
దీంతో అల్లు అర్జున్ టైం చూసి మెగా ఫ్యామిలీని దెబ్బ కొట్టినట్టుగా అయిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పు వల్ల తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దయ్యాయి. బెనిఫిట్ షోలు రద్దు అయితే హీరోలకు చాలా ఇబ్బంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ వల్ల బెనిఫిట్ షోలో అత్యధిక కలెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో రాబోతున్న మెగా హీరోలైన చిరంజీవి విశ్వంభర,రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ మూవీలకు పెద్ద దెబ్బ పడినట్టే.
బెనిఫిట్ షో రద్దు చేస్తే ఈ సినిమాలకు కలెక్షన్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే టికెట్ రేట్లు కూడా ఎక్కువగా పెంచమని తెలంగాణ గవర్నమెంట్ చెప్పడంతో భారీ బడ్జెట్ తో విడుదలబోయే సినిమాలన్నింటికీ పెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఏది ఏమైనప్పటికి ఈ విషయంలో మాత్రం మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ వల్ల పెద్ద దెబ్బ పడిపోయింది అంటున్నారు ఈ విషయం తెలిసిన సినీ ఇండస్ట్రీ జనాలు.(Allu Arjun)