Allu Arjun: మెగా హీరోలను అవమానించేలా ఉన్న రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..వారందరికీ అల్లు అర్జున్ మొగుడంటూ!!

Allu Arjun Called Planet Star by RGV
Allu Arjun Called Planet Star by RGV

Allu Arjun: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా, వర్మ తన ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్‌ను ‘మెగా కంటే మెగా రెట్లు మెగా’గా అభివర్ణించారు. అంతేకాదు, ‘గ్లోబల్ స్టార్’ ని మించి ‘ప్లానెట్ స్టార్’ అనే కొత్త పదాన్ని వాడారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి. అల్లు అర్జున్ అభిమానులు ఈ మాటలను స్వీకరించగా, మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

Allu Arjun Called Planet Star by RGV

అయితే వర్మ మొత్తంగా మూడు విషయాలను ప్రధానంగా వివరించారు. మొదటిది, ‘పుష్ప-2’ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ విడుదలగా నిలవనుందని, ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు బాక్సాఫీస్‌ను పునాదులను కదిలిస్తాయని అన్నారు. రెండవది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని, దీనివల్ల అల్లు అర్జున్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. మూడవది మరింత ఆసక్తికరంగా ఉంది – అల్లు అర్జున్ ఈ చిత్రానికి రూ. 287 కోట్ల పారితోషికం అందుకున్నారని వర్మ పేర్కొనడం, సినీ పరిశ్రమలో సంచలనమైంది.

Also Read: Pushpa-2: పుష్ప-2 క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్.. తెలియాలంటే ఇది చూడాల్సిందే.?

వర్మ వ్యాఖ్యలు చలనచిత్ర పరిశ్రమలో పలు చర్చలకు దారితీశాయి. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం వర్మ వ్యాఖ్యలను ప్రత్యేకంగా భావిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌కు ఈ వ్యాఖలు ఎంతో ఉపయోగపడతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ‘పుష్ప-2’ సిరీస్‌ పై ఉన్న అంచనాల దృష్ట్యా, ఈ సినిమా మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కూడా ఈ సినిమాతో ఇంకా ఎంతో ఎత్తుకు చేరతారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వర్మ వ్యాఖ్యలు ‘పుష్ప-2’ పై ఆసక్తిని పెంచడంతో పాటు భారీ కలెక్షన్స్ వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటికే తొలి రోజు 200 కోట్లను వసూలు చేస్తుందని అంటున్న నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత కీలకం కానున్నాయి. ఏదేమైనా ఈ చిత్ర విజయం అల్లు అర్జున్ కెరీర్‌లో మరొక మైలురాయి చేరడం ఖాయం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *