Allu Arjun: కన్నీరు పెట్టిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ్.. అల్లు అర్జున్ ను చూసేందుకు వెళ్లి?
Allu Arjun: హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో జరగబోయే పుష్ప 2 ప్రీమియర్ షోను చూసేందుకు అభిమానులు భారీగా ఆసక్తి చూపారు. అల్లు అభిమానులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుని ఈవెంట్‌కు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం నుంచి, వాట్సాప్ గ్రూపుల్లో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం తెగ వైరల్ అయింది.
Allu Arjun Fans Face Tragedy at Event
ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ కి వెళ్ళాలి అనుకున్నాడు శ్రీతేజ. అల్లు అర్జున్ కు స్వతహాగా అభిమాని అయినా శ్రీతేజ్ తల్లి రేవతితో కలిసి థియేటర్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. “మమ్మీ, మనం కూడా వెళ్ళుదామా?” అని తల్లి రేవతిని అడిగిన శ్రీతేజ అల్లు అర్జున్ ను స్వయంగా చూడాలనే ఆసక్తితో అక్కడికి వెళ్ళింది. అయితే అక్కడ అనుకోకుండా క్రౌడ్ ఎక్కువగా రావడంతో ఆ తొక్కిసలాటలో తల్లి రేవతి మరణించగా శ్రీతేజ గాయపడిన విషయం తెలిసిందే.
Also Read: Indian movies: కలెక్షన్స్ లో మాత్రం అస్సలు తగ్గేదెలా.. సత్తా చాటుతున్న అల్లు అర్జున్ పుష్ప 2!!
ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ అల్లు అర్జున్ కి మొదటినుంచి అభిమాని కాగా ఓ సందర్భంలో శ్రీతేజ్ చేసిన రీల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదేమైనా అభిమానిగా అల్లు అర్జున్ ను చూడడానికి వచ్చిన శ్రీతేజ్ కి, అతని తల్లి రేవతి కి ఈ విధంగా జరగడం బాధాకరం. ఈ విషయమై అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకి కూడా వెళ్ళాడు.