Allu Arjun future movies: బడా ప్రాజెక్ట్ కు ఒకే చెప్పిన అల్లు అర్జున్.. అట్లీ అయితే కాదు!!

Allu Arjun future movies: పుష్ప 2′ భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా చేస్తున్న ఆయన, మరో భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తమిళ దర్శకుడు అట్లీ కుమార్‌తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారు. ఈ వార్తతోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Allu Arjun future movies latest news
అట్లీ, బన్నీ కాంబినేషన్‌లో భారీ సినిమా రాబోతోందని సమాచారం. ఇటీవల అట్లీ దర్శకత్వం వహించిన ‘బేబీ జాన్ ‘ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయితే, ఆయన బాలీవుడ్‌ను విడిచిపెట్టడం లేదు. సల్మాన్ ఖాన్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌ను వాయిదా వేసి, ముందుగా అల్లు అర్జున్‌తో సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమా కావడంతో, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ‘బిగిల్’ తర్వాత అట్లీ సౌత్‌లో సినిమా చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ద్వారా ఆయన సౌత్‌లో రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడు సాయి అభయంక సంగీతం అందించనున్నారు. ఆయన ప్రముఖ గాయకుడు టిప్పు కుమారుడు అని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చేవరకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ కొత్త రికార్డులు సృష్టిస్తాడా అనేది చూడాలి.