Allu Arjun on Pushpa3: పుష్ప 3 గురించి అల్లు అర్జున్.. స్క్రిప్ట్ రెడీ అయ్యిందా?

Allu Arjun on Pushpa3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ “పుష్ప 2” ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. మొదటి భాగం “పుష్ప ది రైజ్” సంచలన విజయాన్ని నమోదు చేసిన తర్వాత, అభిమానులు “పుష్ప 2” కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించింది. సినిమా భారీ వసూళ్లను రాబట్టగా, మేకర్స్ ఈ ఫ్రాంచైజీని మూడు భాగాలు చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.
Allu Arjun on Pushpa3 Sequel Plans
తాజాగా, “పుష్ప 3” ను “పుష్ప ది ర్యాంపేజ్” పేరుతో తెరకెక్కించనున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే, లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “పుష్ప 3 గురించి నాకేం తెలీదు” అంటూ చెప్పిన ఆయన, సుకుమార్ కూడా ఇంకా ఏమీ ఫైనలైజ్ చేయలేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు అభిమానుల్లో సందేహాలు పెంచుతున్నాయి.
ఫ్రాంచైజీ ముగింపు గురించి క్లారిటీ ఇచ్చినప్పటికీ, స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి. అయితే, పుష్ప 3 సినిమాకు కనీసం మరో రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుందని నిర్మాతలు ముందుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఐకాన్ స్టార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సిరీస్‌లోని ప్రతి భాగం ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయడంతో, “పుష్ప 3″పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మేకర్స్ ఎప్పుడు అధికారిక అప్డేట్ ఇస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.