Allu Arjun: అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఒక వెలుగు వెలుగుతున్న హీరో. అలాంటి ఈయన ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి.. ఎవరిని కూడా కించపరచరు. తన పని ఏంటో తాను చూసుకుంటూ ముందుకు కదులుతారు. అలాంటి అల్లు అర్జున్ తనకు సినీ జీవితాన్ని ఇచ్చినటువంటి తన తండ్రి పరువును ఒక్కసారిగా తీసేశారు.. మరి ఆయన తండ్రి అల్లు అరవింద్ ను ఏమన్నారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Allu Arjun scolded his father for being a pisser
అయితే బాలకృష్ణ ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న అనుష్టపబులు షో కి అల్లు అర్జున్ వెళ్లిన విషయం అందరికీ తెలుసు. ఈ షోలో బాలకృష్ణ అల్లుఅర్జున్ మధ్య ఎన్నో సంభాషణలు జరిగాయి. ఇందులో వారి పర్సనల్ విషయాలు, ఫన్నీ విషయాలన్నింటిని పంచుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన తండ్రి అల్లు అరవింద్ గురించి అల్లు అర్జున్ ప్రశ్నించగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.. మా నాన్న చాలా పిసినారి అని, బడ్జెట్ పద్మనాభంను మించిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. (Allu Arjun)
Also Read: Sai Dharam Tej: నా పాప అంటూ ఆ హీరోయిన్ తో ఉన్న వీడియో షేర్ చేసిన సాయి ధరంతేజ్.. పెళ్లి ఫిక్సా.?
నేను చిన్నతనంలో ఆయన పర్సులో నుంచి డబ్బులు తీసుకుందామంటే అందులో అస్సలు పెట్టుకునే వారు కాదని ఆయన డబ్బంతా బట్టల్లో దాచుకునే వారని తెలియజేశారు. అయితే నాకు చదువు సరిగా రావడం లేదని పెద్ద స్కూల్ నుంచి చిన్న స్కూల్లో చేర్పించారు. ఆ చిన్న స్కూల్ లోకి కారు డ్రైవర్ తో వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే. దీంతో నాకు నామూషి అనిపించి కారును వీధి చివరన ఆపించి నడుచుకుంటూ వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. ఇక నాకు ఓ ఏజ్ వచ్చాక కారు కొనివ్వమని మా నాన్నని అడిగితే ఒక డొక్కు కారు కొనిచ్చారని, ఇక ఆ కారులో వెళ్లే కంటే నడుచుకుంటూ వెళ్తే తొందరగా గమ్యాన్ని చేరుకుంటామని అన్నారు.
వాళ్ల నాన్న పిసినారి తనం గురించి ఆ వేదికగానే తెలియజేశారు అల్లు అర్జున్. ఆయన మాటలు విన్నటువంటి బాలకృష్ణ నవ్వుతూ, నీకు డబ్బు విలువ తెలియాలనే అలా మీ నాన్న చేసి ఉంటారు, అలా చేశారు కాబట్టి మీరు ఈ స్థాయికి ఎదగ గలిగారు అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అల్లు అరవింద్ గురించి కొడుకు ఆ విధంగా చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ అభిమానులు డిఫరెంట్ గా కామెంట్లు పెడుతున్నారు.(Allu Arjun)