KCR: కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు అల్లు అర్జున్ ?

KCR: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే తన కుటుంబంతో కలిసి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవాలని అనుకుంటున్నారట. బెయిల్ పైన బయటకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…. ఏ క్షణమైన బెయిల్ రద్దు అవుతుందని భయపడుతున్నారట. రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా తనపై వ్యవహరిస్తోందని…. అల్లు అర్జున్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. KCR

Allu Arjun to KCR Farm House

త్వరలోనే కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఈ విషయంపై చర్చించబోతున్నారట. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం కారణంగా… రేవంత్ రెడ్డి కేసులను.. ఎదుర్కోవాలంటే కెసిఆర్ సలహాలు అలాగే సూచనలు అవసరమని భావిస్తోందట అల్లు అర్జున్ కుటుంబం. ఇందులో భాగంగానే తన మామయ్య కాంగ్రెస్ నేత.. చంద్రశేఖర్ సలహా కూడా తీసుకుంటున్నారట అల్లు అర్జున్. KCR

Also Read: Nara Bhuvaneshwari: బాలయ్య డైలాగ్ తో రెచ్చిపోయిన నారా భువనేశ్వరి ?

మొన్నటి ఎన్నికల కంటే ముందు వరకు గులాబీ పార్టీలోనే అల్లు అర్జున్ మామయ్య ఉన్నారు. ఆయన ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అపాయింట్మెంట్ కూడా అడిగిందట అల్లు కుటుంబం. దీనికి గులాబీ పార్టీ నేతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే కెసిఆర్ కు సంబంధించిన ఎర్రవెళ్లి ఫామ్ హౌస్ లో ఆయనను అల్లు కుటుంబం కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *