Allu Arjun: కొరియోగ్రాఫర్ ని టార్చర్ చేసిన అల్లు అర్జున్..?

Allu Arjun: చేసే పనిలో నిబద్ధత ఓపిక ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కాగలమని నిరూపించారు అల్లు అర్జున్.. ఆయన బడా కుటుంబం నుంచి వచ్చి హీరో అయినా కానీ సినిమా షూటింగ్ విషయానికి వస్తే చాలా నిబద్ధతతో ఉంటారు.. దర్శక నిర్మాతలు ఏది చెప్పిన తిరుగు మాట్లాడకుండా చేస్తారు. అంత సిస్టమెటిక్ గా ఉంటారు కాబట్టి ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అలాంటి అల్లు అర్జున్ నటనపరంగానే కాకుండా డాన్స్ తో కూడా అదరగొట్టేస్తారు. ఆయన డాన్స్ కు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు.
Allu Arjun tortured the choreographer
ఆయన వేసిన స్టెప్స్ ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ సమయంలో కొరియోగ్రాఫర్ ను చాలా టార్చర్ పెట్టారట.. మరి అలా ఎందుకు చేశారు వివరాలు చూద్దాం.. ది గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి పుష్ప, పుష్ప2 అద్భుతమైన హిట్ సాధించాయి. దీంతో అల్లు అర్జున్ పేరు దేశ విదేశాల్లో మార్మోగిపోతోంది.(Allu Arjun)
Also Read: Mohan Babu: మోహన్ బాబు కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..అంత అవమానమా..?
ఇక పుష్ప2 సినిమా కలెక్షన్స్ పరంగా బాహుబలి చిత్రాన్ని కూడా దాటి ముందు స్థాయిలో ఉంది. ఈ సినిమా స్టోరీ పరంగానే కాకుండా, పాటలపరంగా కూడా అద్భుతమైన హిట్ సాధించిందని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గంగమ్మ తల్లి జాతర సాంగ్. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య.. దీన్ని కొరియోగ్రఫీ చేసే సమయంలో అల్లు అర్జున్ ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టారట.. ఈ సాంగ్ షూట్ సమయంలో అల్లు అర్జున్ కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అయినా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సాంగ్ మొత్తం పూర్తి చేయాలి లేదంటే బాగుండదు అంటూ గణేష్ మాస్టారుకు చెప్పారట.. ఆయన అంత నిబద్ధతతో ఉన్నారు కాబట్టే ఆ చిత్రం అద్భుతమైన హిట్ సాధించడమే కాకుండా ఈ సాంగ్ కూడా పాపులర్ అయిందని గణేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Allu Arjun)