Allu Arjun: వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్.. పాపం ఇలా దొరికిపోయాడేంటి.?
Allu Arjun: ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే చాలు సినిమాకు సంబంధించి పాజిటివ్ కంటే నెగటివ్ ఉన్న అంశాలనే ఎక్కువగా వెతుకుతారు నెటిజెన్స్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డైలాగుల నుంచి మొదలు ఆ సినిమాలో సీన్లు, క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి? ఎవరినైనా కించపరిచేలా ఉన్నాయా అనే విషయాలను వెతికి మరీ పట్టుకొని వాటిపై వివాదాలు సృష్టిస్తూ ఉంటారు.
Allu Arjun who is stuck in controversy
అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు అలాంటి వివాదాల్లో చిక్కుకున్నాయి. అయితే తాజాగా పుష్ప టు సినిమా కూడా వివాదాస్పదమవుతుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా వార్తలు రాస్తున్నారు. పుష్ప టు సినిమాలో వివాదమయ్యే సీన్లు ఏమున్నాయో ఆ వివరాలు చూద్దాం.. పుష్ప -2 సినిమా లో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే పాత్రలో నటిస్తారు. (Allu Arjun)
Also Read: Pushpa-2 OTT: భారీ ధరకు పుష్ప ఓటిటి రైట్స్ దక్కించుకున్న సంస్థ.. పుష్ప గాడి క్రేజ్ మామూలుగా లేదు..?
ఇంతకుముందు పుష్ప-1 సినిమాలో ఆయన నటనకు నేషనల్ అవార్డు వచ్చింది.దీంతో చాలామంది ఇలాంటి పాత్రల్లో నటించే వారికి అవార్డు ఇచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆయన చేసిన స్మగ్లర్ పాత్రకి కాదు ఆయన నటనకి అవార్డు వచ్చిందంటూ కవర్ చేశారు. అయితే తాజాగా పుష్ప టు సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది.
అల్లు అర్జున్ ఒక లీడర్ తో ఫోన్ మాట్లాడుతూ నేను తిరుపతి లడ్డు లాంటోడిని అంటూ డైలాగ్ విసురుతారు. అయితే ఈ సినిమాలో ఆయన చేసే పాత్ర స్మగ్లర్. ఇలాంటి ఆయన స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డుతో పోల్చుకోవడం కొంతమందికి మింగుడు పడడం లేదు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూని కూడా ఈ స్మగ్లర్ పాత్రలోకి లాగారంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ తిరుపతి లడ్డు డైలాగ్ పై ముందు ముందు ఎలాంటి వివాదం తెరపైకి తీసుకు వస్తారో చూడాలి..(Allu Arjun)